ఆశ‌లు లేని స్థితిలో సౌతాఫ్రికా టీమ్ మేట్ డేవిడ్ మిల్ల‌ర్ పోరాటం….

ముంబై: రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజు శాంస‌న్ 14సీజ‌న్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత ఎక్కువ ధ‌ర ప‌లికిన ఆట‌గాడు. కానీ మొద‌టి మ్యాచ్‌లో అత‌ని వ‌ల్ల కాద‌నుకున్నాడేమోగానీ కనీసం స్ట్రైక్ ఇవ్వ‌లేదు. అయితే త‌రువాత మ్యాచ్‌లో తానెంటో , తాను ఎందుకంత ధ‌ర ప‌లికానో నిరూపించాడు. క్రిస్ మోరిస్‌… రాయ‌ల్స్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఆశ‌లు లేని స్థితిలో త‌న సౌతాఫ్రికా టీమ్ మేట్ డేవిడ్ మిల్ల‌ర్ అద్భుత పోరాటం నుండి స్ఫూర్తి పొందిన మోరిస్… చివ‌ర్లో మిగిలిన ప‌ని పూర్తి చేశాడు. కేవ‌లం 18 బంతుల్లో 36 ప‌రుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లాడు.ఇందుకేనా అత‌న్ని 16 కోట్ల‌కుపైగా పెట్టి కొన్న‌ది అని తొలి మ్యాచ్ త‌రువాత అన్న వాళ్లే.. ప్ర‌స్తుతం మోరిస్ ఆట చూసి ఫ‌న్నీ మేమ్స్‌తో ట్విట‌ర్ ను నింపేస్తున్నారు. ఇందులో టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందున్నాడు. మొన్న‌టి మ్యాచ్ , ఇప్ప‌టి మ్యాచ్ ఫొటోల‌ను అత‌డు షేర్‌చేస్తూ .. మొన్న ఫైన‌ల్ వ‌చ్చిన‌య్ కానీ ఇజ్జ‌త్ కూడా అని వీరూ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. అత‌నిలాగే మిగ‌తా నెటిజ‌న్లు కూడా మేమ్స్‌తో మోరిస్
ఇన్నింగ్స్‌ను ఆకాశానికెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *