విదేశీ ఆట‌గాళ్ళ జీతాల్లో కోత …

హైద‌రాబాద్: ప‌్ర‌స్తుతం దేశంలో క‌రోనా విలాయ‌తాడ‌వం చేస్తున్న‌ది తెలిసిన విష‌య‌మే. ఇలాంటి త‌రుణంలో ఐపీఎల్ 14వ సీజ‌న్ అర్ధాంత‌రంగా నిలిచిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే టోర్నీలో 29 మ్యాచులే జ‌ర‌గ‌గా మిగిలిన మ్యాచ్ ల‌ను సెప్టెంబ‌ర్లో యూఏ ఈలో నిర్వ‌హించాల‌ని బీసీసీఐ నిర్ణ‌యించింది.కానీ ఐపీఎల్ రెండో ద‌శ మ్యాచ్ ల‌కు టోర్నీలో పాల్గొనే విదేశీ ఆట‌గాళ్లు అంద‌రూ అందుబాటులో ఉండే అవ‌కాశం లేదు. ఆయా దేశాల‌కు ద్వైపాక్షిక సిరీసులు ఉండ‌డంతో ఆట‌గాళ్ళ‌ను స‌ద‌రు బోర్డులు ఐపీఎల్‌లో ఆడేందుకు వెళ్ళ‌డానికి అనుమ‌తి ఇవ్వ‌డం లేదు. దీంతో ఇంగ్లాండ్ , ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, బంగ్లాదేశ్ క్రికెట‌ర్లు ఐపీఎల్లో ఆడేందుకు యూఏఈకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. అయితే ఐపీఎల్ రెండో ద‌శ మ్యాచ్‌ల‌ను ఆడేందుక యూఏఈకి రాని విదేశీ ఆట‌గాళ్ళ జీతాల్లో కోత ప‌డ‌నుంది. ఆట‌గాళ్ల‌కు చెల్లించే పారితోషికంలో కోత పెట్టే హ‌క్కులు ఫ్రాంచైజీల‌కు ఉన్నాయ‌ని బీసీసీఐ అధికారి ఒక‌రు తెలిపారు. అయితే బీసీసీఐ ఒప్పందం ఆట‌గాళ్ల‌కు జీతాల్లోఎలాంటి కోత ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసారు. 2011 నుండి ఒప్పంద ఆట‌గాళ్ల‌కు భీమా వ‌ర్తిస్తుండం వ‌ల్ల వారి జీతాల్లో కోత ఉండ‌ద‌ని వివ‌రించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *