భ‌ర్త జ్ఞాప‌కాల‌ను, అత‌డితో గ‌ల అనుబంధాన్ని గుర్తుచేస్తుకుంది..

డేవిడ్ వార్న‌ర్ కుటుంబానికి ఎంతో ప్రాధ‌న్య‌త ఇస్తాడు. త‌న భార్య క్యాండీస్‌తో పాటు ముగ్గురు కుమారైల‌ను బాగా చూసుకుంటాడు. ఆయ‌న తీరిక దొరికిన్న‌పుడ‌లా వారితో ఆనందంగా గ‌డుపుతాడు. అందుకు సంబంధించిన ఫొటోలు ,వీడియోల‌ను సైతం సామాజిక మాధ్య‌మాల్లో పంచుకొని ఆనందం వ్య‌క్తం చేస్తాడు. అయితే, కొత్త‌గా వార్న‌ర్ స‌తీమ‌ణి క్యాండీస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేసి త‌న భ‌ర్త జ్ఞాప‌కాల‌ను, అత‌డితో గ‌ల అనుబంధాన్ని గుర్తుచేస్తుకుంది. అత‌డిని సూప‌ర్ డాడ్‌గా పేర్కొంది. వీకెండ్ ప్లాన్స్ ఏంట‌ని అంద‌రూ న‌న్ను అడుగుతుంటారు. కానీ, సూప‌ర్ డాడ్ వార్న‌ర్ ఇంట్లో ఉంటే మా రోజు ఇలా ఉంటుంది. మాకు వీకెండ్స్ అంటే పిల్ల‌ల ఆనందమే . అవ‌న్నీ ఇప్పుడు మిస్ అవుతున్నాం .కానీ రాబోయే రోజుల్లో వార్న‌ర్ ఇంట్లో ఉండ‌టం త‌ల‌చుకుంటే ఆనందంగా ఉంది. అని క్యాండీస్ పోస్టు చేసింది.దీంతోపాటు గ‌తంలో అత‌డు ఇంట్లో ఉన్న స‌మ‌యంలో త‌మ పిల్ల‌ల‌తో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపిన క్ష‌ణాల‌ను అభిమానుల‌తో పంచుకుంది. అందులో వార్న‌ర్ బిస్కెట్లు త‌యారుచేస్తూ, త‌న కుమారైల‌తో ఆడుకుంటూ సంతోషంతో ఉంటాడు. ఇదంతా చూసిన వార్న‌ర్ వెంట‌నే..మీ అంద‌ర్నీ చూడ‌కుండా ఉండ‌లేక‌పోతున్నానంటూ బ‌దులిచ్చాడు. కాగా, వార్న‌ర్ ఇటీవ‌ల ఇండియాలో జ‌రిగిన ఐపీఎల్ 14 వ సీజ‌న్‌లో పాల్గొన్న విష‌యం తెలిసిందే.ఇక్క‌డ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు ఆరు మ్యాచుల్లో కెప్టెన్సీ చేశాడు. అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల జ‌ట్టు, యాజ‌మాన్యం అత‌డిని కెప్టెన్‌గా తొల‌గించింది. విలియ‌మ్స‌న్‌కు ప‌గ్గాలు అంద‌జేసింది. ఈ క్ర‌మంలో మొత్తం ఏడు మ్యాచుల్లో స‌న్ రైజ‌ర్స్ ఒకే ఒక్క విజ‌యం సాధించి పాయింట్లు ప‌ట్టిక‌లోచివ‌ర‌స్థానంలో నిలిచింది. ఇక కొవిడ్ కేసుల కార‌ణంగా టోర్నీ వాయిదా ప‌డ‌టంతో వార్న‌ర్ తిరిగి స్వ‌దేశం చేరుకున్నాడు. అంత‌కుముందు ఇండియా నుండి నేరుగా రాక‌పోక‌లు లేక‌పోవ‌డంతో ఆస్ట్రేలియా ఆట‌గాళ్లంద‌రితో పాటే మాల్దీవుల‌కు వెళ్లాడు. గ‌తవారం స్వ‌దేశానికి చేరుకున్న అత‌డుఇప్పుడు కొద్ది రోజులు ప్ర‌త్యేక క్వారంటైన్‌లో ఉంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *