ఐపీఎల్ మ్యాచ్‌లు ముంబైలో షెడ్యూల్ ప్ర‌కార‌మే….

ఇండియాలో కొవిడ్ మ‌హ‌మ్మారి రెండో ద‌శ‌లో కోర‌లు చాస్తున్న వేళ‌, వ్యాప్తిని అరిక‌ట్ట‌డానికి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వారాంత‌పు లాక్‌డౌన్ విధించ‌డంతో, వాంఖ‌డే స్టేడియంలో మ్యాచులు జ‌రుగుతాయా లేదా అన్న‌దానిపై అభిమానుల ఉత్కంఠ‌కు బీసీసీఐ తెర దించింది. ముంబై క్రికెట్ సోషియేష‌న్‌(ఎంసిఎ) కార్య‌ద‌ర్శి సంజ‌య్‌నాయ‌క్ మాట్లాడుతూ ఐపీఎల్ మ్యాచులు షెడ్యూల్ ప్ర‌కార‌మే మ్యాచ్‌లు జ‌రుగుతాయ‌ని, ఇందులో ఎటువంటి మార్పు లేద‌ని తెలిపారు. ఆట‌గాళ్లు మాత్ర‌మే కాదు, స‌హాయ సిబ్బంది, చివ‌రికి బ‌స్సు డ్రైవ‌ర్లు, ఇలా ప్ర‌తిదీ బ‌యో సేప్టీ బ‌బుల్ లో ఉన్నందున ఇది స‌మ‌స్య కాద‌ని బీసీసీఐ భావిస్తోంది. మ్యాచ్ రోజులలో స్టేడియానికి ప్ర‌యాణించ‌డం స‌మ‌స్య‌కాదు . ఆట‌గాళ్ల‌తో పాటు వారి స‌హాయ సిబ్బందికి కూడా క్ర‌మం త‌ప్ప‌కుండా పరీక్ష‌లు జ‌రుగుతున్నాయి. గ‌త ఏడాది దుబాయిలో తీసుకున్న జాగ్ర‌త్త‌లు లానే అన్ని ఏర్పాట్ల‌ను బోర్డు చేస్తోంద‌ని తెలిపారు. ఇక ఐపీఎల్ లో పాల్గొనే ఆట‌గాళ్ల‌ను కాపాడుకోవాలంటే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గ‌మ‌ని బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా భావించి ఇప్ప‌టికే ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నారు. వాంఖ‌డే స్టేడియం ఈ సీజ‌న్‌లో ఏప్రిల్ 10-25 వ‌ర‌కు 10 మ్యాచుల‌కు అతిథ్యం ఇవ్వ‌నుంది. స్టేడియంలో జ‌రిగే తొలి మ్యాచ్ ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిట‌ల్స్ , చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఢిల్లీ క్యాపిట‌ల్స్‌, ముంబై ,ఇండియన్స్‌, పంజాబ్‌కింగ్స్‌, రాజ‌స్థాన్‌రాయ‌ల్స్ ఇప్ప‌టికే ఈ జ‌ట్టు ముంబైలో త‌మ‌స్థావ‌రాన్ని ఏర్పాటు చేసుకోని నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *