నా జీవితంలో ఇది మ‌రిచిపోలేని విష‌యం…..

న్యూఢిల్లీ: భార‌త్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంత‌ర్జాతీయ దినోత్స‌వం సందర్భంగా జీవితంలో తొలిసారి తండ్రిగా మారిన విరాట్ కాస్తా ఎమోష‌న‌ల్గా ఫీల‌య్యారు. విరాట్-అనుష్క త‌న కూతురుతో ఎంతో ఉల్లాసంగా ఆడుకుంటూ అనుష్క క‌నిపిస్తారు. బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌, క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ జ‌న‌వ‌రి11న కుమారైకు జ‌న్మనిచ్చారు. ఈ ఆనంద‌క‌ర‌మైన వార్త‌ను విరాట్ త‌న అభిమానుల‌తో సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. పాపాయి పుట్టిన 21 రోజుల అనంత‌రం అనుష్క త‌న మొద‌టి ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసి చిన్నారి పేరును వెల్ల‌డించింది. అంత‌ర్జాతీయ మ‌హిళాదినోత్స‌వం సంద‌ర్భంగా త‌న కుటుంబం ఫోటోను షేర్ చేసిన కోహ్లీ.. పిల్ల‌ల పుట్టుక‌ను గ‌మ‌నిస్తే…. వెన్నెముక‌లో జ‌ల‌ద‌రింపు వ‌స్తుంది. అదో అద్బుత‌మైన అనుభ‌వం .దాన్ని ఎవ‌రైనా ప్ర‌త్య‌క్షంగా చూసిన త‌రువాత మ‌హిళ‌ల నిజ‌మైన బ‌లం, దైవ‌త్వాన్ని అర్థం చేసుకుంటారు. దేవుడు వారి క‌డుపులో మ‌రో జీవితాన్ని ఎందుకు సృష్టించాడు? వారు పురుషుల కంటే బ‌లంగా ఉన్నారు. కాబ‌ట్టే. నా జీవితంలో ఇది మ‌రిచిపోలేని సంగ‌తి. నాకూతురు కూడా ఆమె త‌ల్లిలా ఎదుగుతుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌పంచంలోని అద్భుత‌మైన మ‌హిళలంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *