ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు చెల్లింపున‌కు ఫిబ్ర‌వ‌రి 11 వ‌ర‌కు తుదిగ‌డువు ….

హైద‌రాబాద్‌: ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ఫీజు చెల్లింపు తేదీల‌ను తెలంగాణ ఇంట‌ర్మిడియ‌ట్ బోర్డు శ‌నివారం ప్ర‌క‌టించింది. ఇంట‌ర్ పరీక్ష ఫీజు చెల్లింపున‌కు ఫిబ్ర‌వ‌రి 11 వ‌ర‌కు తుదిగ‌డువు విధించినట్లు బోర్డు తెలిపింది. రూ.100 ఆల‌స్య రుసుంలో ఫిబ్ర‌వ‌రి 22వ‌ర‌కు, రూ. 500 ఆల‌స్య రుసుంలో మార్చి 2వ తేదీ వ‌ర‌కు, రూ.1000 ఆల‌స్య రుసుముతో మార్చి9 వ‌ర‌కు, అదే రూ. 2 వేల ఆల‌స్య రుసుముతో మార్చి 16 వ‌తేదీ వ‌ర‌కు ఫీజు చెల్లింపు గ‌డువును పెంచింది. ఇంట‌ర్మీడియ్ వార్షిక ప‌రీక్ష‌ల‌ను మే1 నుంచి 20వ తేదీ వ‌ర‌క నిర్వ‌హించ‌నున్న‌ట్లు విద్యాశాఖ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మే1 నుంచి19 వ‌ర‌కు మొద‌టి ఏడాది మే2 నుంచి 20వ‌ర‌కు రెండ‌వ ఏడాది విద్యార్థుల‌కు పరీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు పేర్కొంది. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు పరీక్ష‌లు జ‌రుగుతాయంది. ఏప్రిల్‌7 నుంచి20 వ‌ర‌కు ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు. ఇంట‌ర్న‌ల్ పరీక్ష‌లయిన ఎథిక్స్ అండ్ హ్యుమ‌న్ వ్యాల్యుస్ ప‌రీక్ష‌ను ఏప్రిల్ 1న‌, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేష‌న్ ప‌రీక్ష‌ను ఏప్రిల్ 3న నిర్వ‌హించ‌నున్నామ‌ని చెప్పారు. ఒకేష‌న‌ల్ కోర్పుల‌కూ ఇదే టైంటేబుల్ వ‌ర్తిస్తుంద‌ని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *