బిగ్ స్ట్క్రీన్‌పై నీ ముఖం కానీ చూసుకున్నావా ఏంటీ…

మెల్‌బోర్న్ ః ఆస్ట్రేలియా ఆటగాళ్లు మ‌ళ్లీ మొద‌లెట్టారు. మైదానంలో ప్ర‌త్య‌ర్థుల ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీసేందుకు ఉప‌యోగించే క‌వ్వింపు చ‌ర్య‌లు (స్లెండ్జింగ్‌) కు పాల్ప‌డ‌డంలో ఆసీస్ ఆట‌గాళ్లు దిట్ట‌లు. ఆట‌లో వెన‌క‌బ‌డితే ఇలా పైచేయి సాధించ‌డం వారికి వెన్న‌తో పెట్టిన విద్య‌. వారి ట్రాప్‌లో ఆట‌గాళ్లు చిక్కారంటే ఇక వాళ్ల ప‌ని అయిపోయిన‌ట్టే. భార‌త్ తో జ‌రిగిన వ‌న్డే, టీ20 సిరీస్‌తోపాటు తొలి టెస్టులోనూ స్లెడ్జింగ్‌కు దూరంగా ఉన్న కంగారూలు.. రెండో టెస్టులో మాత్రం మ‌ళ్లీ అలవాటైన స్లెడ్జింగ్‌ను ఆయుధంగా ఎంచుకున్నారు. మ్యాచ్ త‌మ చేతుల్లోంచి జారి పోతుండ‌డంతో వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌, ఆసీస్ ఓపెన‌ర్ మాథ్యూవేడ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. ఇది అక్క‌డున్న స్టంప్స్ మైక్రోఫోన్‌లో రికార్డ‌యింది. వికెట్ల వెన‌క ఉండే పంత్ బౌల‌ర్ల ను ఉత్స‌హ‌ప‌రుస్తుంటాడు. అత‌డి అరుపుల‌కు వేడ్ కాస్తంత అస‌హ‌నంగా పంత్ వైపు చూశాడు. ఆ త‌రువాత బుమ్రా వేసిన బంతిని వేడ్ లెగ్ సైడ్ లో ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. దీంతో పంత్‌..హెహ్హ‌హ్హే.. అంటూ గ‌ట్టిగా న‌వ్వాడు. వెంట‌నే స్పందించిన వేడ్.. హె హ్హె హ్హే అంటూ బ‌దులిస్తూనే… బిగ్ స్ట్క్రీన్‌పై నీ ముఖం కానీ చూసుకున్నావా ఏంటీ? అని రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు. వారి మాట‌లు అక్క‌డి స్టంప్స్ మైక్రోఫోన్ల‌లో రికార్డ‌య్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *