జాత్యాంహ‌కారి వేధింపుల‌కు గురైన బుమ్రా,సిరాజ్‌

సిడ్నీః ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న మూడ‌వ టెస్టులో భార‌త బౌల‌ర్లు మొహ‌మ్మ‌ద్ సిరాజ్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రాలు జాత్యాంహ‌కార వేధింపుల‌కు గుర‌య్యారు. సిడ్నీ క్రికెట్ మైదానంలో ఉన్న ప్రేక్ష‌కులు ఈ వేధింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. మూడ‌వ రోజుల ఆట ముగిసిన స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న ఫిర్యాదు. సీనియ‌ర్ ప్లేయ‌ర్లు కెప్టెన్ అజింక్య‌ర‌హానే, ర‌విచంద్ర అశ్విన్ లు… ఈ అంశాన్ని మ్యాచ్ అంపైర్ల‌కు ఫిర్యాదు చేశారు. పౌల్ రైఫిల్‌, పౌల్ విల్స‌న్ అంపైర్ల‌తో ఈ అంశంపై ర‌హానే చాలా సేపు చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఆట ముగిసిన 5 నిమిషాల త‌రువాత కూడా ఈ అంశం గురించి అంపైర్ల‌తో చర్చ జ‌రిగిన‌ట్లు చెబుతున్నారు. అయితే దీనిపై ఐసీసీ నిర్ణ‌యం తీసుకోనున్న‌ది. సెక్యూర్టీ అధికారుల‌తోనూ ర‌హానే మాట్లాడిన‌ట్లు తెలుస్తోంది. జాత్యాంహ‌కార వ్యాఖ్య‌లు ప‌ట్ల భార‌తీయ అధికారులు ఆగ్ర‌హం ఉన్న‌ట్లు ప‌లు మీడియా సంస్థ‌లు పేర్కోన్నాయి. మూడ‌వ రోజుల ఆట ముగిసే స‌మ‌యానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయి 103 ర‌న్స్ చేసింది. ఇండియా త‌న తొలి ఇన్నింగ్స్‌లో 244 ర‌న్స్‌కు ఆలౌట్ అయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *