రెండు జ‌ట్ట‌ను ఆడిస్తున్న ఏకైక దేశం బార‌తదేశం- ఇంజ‌మామ్ ఉల్‌హాఖ్‌

హైద‌రాబాద్‌: పాక్ క్రికెట్ దిగ్గ‌జం ఇంజ‌మామ్ ఉల్‌హాఖ్ ఒకే స‌మ‌యంలో రెండు జ‌ట్ల‌ను ఆడిస్తున్న ఏకైక దేశం భార‌త‌దేశం అన్నాడు. భార‌త్ జ‌ట్టు -ఏక మాదిరిగానే బి టీమ్ సైతం ప‌టిష్టంగా ఉంద‌న్నారు. భార‌త్ ప్రిమియ‌ర్ లీగ్‌, చ‌క్క‌ని దేశవాళీ క్రికెట్ విధాన‌మే ఇందుకు కార‌ణ‌మని వెల్ల‌డించారు. 1998 లో రెండు జ‌ట్లుగా విడిపోయిన ఇండియా విఫ‌ల‌మైంద‌ని వివ‌రించాడు.ఇండియా రెండో జ‌ట్టును బ‌రిలోకి దించ‌డం ఆస‌క్తిగా అనిపిస్తోంది. ప్ర‌స్తుతం భార‌త్ జ‌ట్టు చేస్తున్నట్టే కొన్నేళ్ల ముందు అస్ట్రేలియా ఆధిపత్యం వహిస్తున్న రోజుల్లో అంత‌ర్జాతీయ జ‌ట్ల‌కు ఆస్ట్రేలియా -ఏ, ఆస్ట్రేలియా- బిగా నామ‌క‌ర‌ణం చేయాల‌ని ప్ర‌య‌త్నించింది. కానీ అనుమతి దొర‌క‌లేదు. ఒక‌ప్పుడు, ఆసీస్ చేయ‌లేనిది ప్ర‌స్తుతం ఇండియా చేసేస్తోంది. ఇప్పుడు ఐసోలేష‌న్‌, క్వారంటైన్ ఆంక్ష‌ల్లో ఇది స‌మంజ‌సంగానే అనిపిస్తోంది అని ఇంజ‌మామ్ తెలిపాడు. ఇంగ్లాండ్ ప‌ర్య‌టిస్తున్న జ‌ట్టులాగే శ్రీ‌లంక‌కు వెళ్లే జ‌ట్టూ బ‌లంగానే అనిపిస్తోంద‌ని ఇంజీ అంచనా వేశాడు. ఇండియా వ‌ద్ద భారీ సంఖ్య‌లో ప్ర‌తిభావంతులు ఉన్నారు. శ్రీ‌లంక‌కు వెళ్తున్న ఆట‌గాళ్ల బృంద‌మూ అస‌లైన ఇండియాలాగే అనిపిస్తోంది. ఇండియా త‌న దేశ‌వాళీ క్రికెట్ విధానాన్ని మెరుగుప‌ర్చుకుంది. అదే స‌మ‌యంలో ఐపీఎల్ సాయ‌ప‌డింది. ఫ‌లితంగానే ఇండియా రెండు జ‌ట్ల‌ను పంప‌గ‌లుగుతోంది. జాతీయ జ‌ట్టుకు ఆడ‌గ‌ల 50మంది ఆట‌గాళ్లను బీసీసీఐ సిద్ధం చేసింది. అని అన్నాడు. కాగా 1998 లో కామ‌న్వెల్త్ క్రీడ‌ల కోసం రెండు జ‌ట్లుగా విడిపోయిన‌ప్పుడు ఇండియా విజ‌య‌వంతం కాలేద‌ని పేర్కొన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *