ఏ టీమ్‌నైనా ఎక్క‌డైనా ఓడించ‌గ‌లిగే స‌త్తా త‌మ‌కుంద‌న్నారు…..

హైద‌రాబాద్: భార‌త్ జట్టు న‌యావాల్ చెతేశ్వ‌ర్ పూజారా ప్ర‌పంచంలోని ఓ టీమ్‌నైనా ఎక్క‌డైనా ఓడించ‌గ‌లిగే స‌త్తా త‌మ‌కుంద‌న్నారు. ఎప్పుడూలేనంత బ‌లంగా త‌మ రిజర్వు బెంచి ఉంద‌ని పేర్కొన్నాడు.న్యూజిలాండ్ బౌలింగ్ దాడిని గ‌తంలో ఎదుర్కొన్నామ‌ని తెలిపాడు. సౌథాంప్ట‌న్ త‌ట‌స్థ వేదిక కావ‌డం ఉప‌యోగ‌క‌ర‌మ‌ని వెల్ల‌డించారు. కొవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా సాధ‌న‌కు త‌గినంత స‌మ‌యం దొర‌క‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. ఐసీసీ ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్స్‌కు పుజారా సిద్ధ‌మ‌వుతున్నాడు.ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీసుకూ స‌న్న‌ద్ధం అవుతున్నాడు. కొన్నేళ్ల త‌రువాత అత‌డు భార‌త్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగ‌మైన విష‌యం తెలిసిందే. ఫైన‌ల్స్ జ‌రిగే సౌథాంప్ట‌న్‌లో గ‌త సిరీసులో పుజారా132 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. కాగా చివ‌రి మూడు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో ఈమ‌హ‌మ్మారి స‌మ‌యంలోనూ ఫైన‌ల్స్ ఆడుతుండ‌టం మా అదృష్ఠం. సాధ‌న‌కు స‌మ‌యం దొర‌కున్నా మాకు చాలినంత అనుభ‌వం ఉంది. నా బ్యాటింగ్ ప‌ద్ధ‌తుల్లోమార్చేమీ రాలేదు. రెండేళ్లుగా భార‌త్ జ‌ట్టు అద్భుతంగా ఆడుతోంది. ఫైన‌ల్స్‌కు అర్హ‌త సాధించింది. న్యూజిలాండ్‌తోమ్యాచ్ అద్భుతంగా ఉండ‌నుంది. అని పుజారా అన్నాడు. మా రిజ‌ర్వు బెంచీ ఎప్పుడూ లేనంత బ‌లంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ బ్యాక‌ప్ ఆట‌గాళ్లు ఉన్నారు. ఆసీస్ సిరీస్ అందుకు ఉదాహార‌ణ‌,భార‌త్ జ‌ట్టు ప‌టిష్ట‌మైన జ‌ట్టు. ప్ర‌ణాళిక‌ల‌ను ప‌క్కాగా అమ‌లు చేస్తే ఫ‌లితాలు మాకు అనుకూలంగా వ‌స్తాయి. గ‌త ప‌ర్య‌ట‌న‌లో మేం ఓడాం. కానీ, మాకు త‌గిన‌న్ని అవ‌కాశాలు వ‌చ్చాయి. ఇంగ్లాండ్‌లో గెల‌వ‌గ‌ల స‌త్తామాకుంది. విదేశాల్లోభార‌త్ ఈ మ‌ధ్య బాగా రాణించింది. ఆట‌గాళ్లంతా అత్యంత ఆత్మ‌విశ్వాసంతో ఉన్నారు. అని పుజారా తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *