నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉన్న ర‌క్ష‌ణ స‌మ‌స్య‌ల‌పై సైనికాధిప‌తి స‌మీక్ష‌….

హైద‌రాబాద్: ప‌్ర‌స్తుతం అన్నిరంగాల‌పై క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌భావం ప‌డిందని విషయం తెలిసిందే. ఇలాంటి త‌రుణంలో సీవోఏఎస్ జ‌న‌ర‌ల్ ఎం.ఎం.న‌ర‌వ‌ణె క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి ఉన్న ర‌క్ష‌ణ స‌మ‌స్య‌ల‌పై స‌మీక్షించారు. పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ నుండి ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను అడ్డుకునేందుకు తీసుకున్న చ‌ర్య‌ల‌ను ఆయా యూనిట్ల క‌మాండ‌ర్లు సీవోఏఎస్‌కు వివ‌రించారు. సైనికులు చూపుతున్న ధైర్యాన్ని, కార్యాచ‌ర‌ణ స‌న్న‌ద్ధ‌త‌ను సీవోఏఎస్ ప్ర‌శంసించారు. నియంత్ర‌ణ రేఖ వెంట ఉన్న ఇప్పుడు ప్ర‌శాంత ప‌రిస్థితిని అభినందించిన సీవోఏఎస్‌, దేశ ర‌క్ష‌ణ విష‌యంలో ఏమాత్రం అల‌స‌త్వం చూప‌వ‌ద్ద‌ని, ఎలాంటి స‌వాలు ఎదురైనా స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోన‌డానికి వివిధ ప్ర‌భుత్వ సంస్థ‌లు చేస్తున్న కృషిని కూడా జ‌న‌ర‌ల్ ఎం.ఎం న‌ర‌వ‌ణె మెచ్చుకున్నారు. ఉత్త‌ర సైనిక‌ద‌ళం క‌మాండ‌ర్‌, లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ జోషి, చినార్ కార్ప్స్ క‌మాండర్‌, లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ డి.పి.పాండేతో క‌లిసి సీవోఏఎస్ ప‌ర్య‌టించారు.అక్క‌డి యూనిట్ల‌ను ఆయ‌న ప‌రిశీలించారు.
కశ్మీర్‌ నియంత్రణ రేఖ రక్షణ ఏర్పాట్లపై సైనికాధిపతి సమీక్ష..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *