బౌలింగ్ ప‌రంగానే కాకుండా మ్యాచ్ ప్ర‌ణాళిల్లో అశ్విన్‌….

హైద‌రాబాద్‌: భార‌త‌జ‌ట్టు స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ కొన్ని రోజులుగా తుదిజ‌ట్టులో చోటు సంపాదించ‌లేక‌పోయాడు. ఇప్పుడు సొంత దేశంలో ఇంగ్లండ్ జ‌ర‌గ‌బోయే టెస్టు సిరీస్ కోసం సిద్ధ‌మ‌వుతోన్న అత‌డు ఈ సిరీస్ అయినా చోటు ల‌భించాల‌న్న కోరిక‌తో ఉన్నాడు. తాజాగా త‌న బౌలింగ్ మ‌రింత‌గా సాన‌బెట్ట‌డం కోసం భార‌త‌జ‌ట్టు స్పిన్న‌ర్ ర‌వి అశ్విన్ స‌ల‌హాలు ఇచ్చాడ‌ని తెలిపాడు. అశ్విన్ కొన్ని స‌ల‌హాలు ఇచ్చాడు. నారిథ‌మ్లో ఇంకాస్త వేగం పెంచుకోమ‌ని, బంతిని స్ట్రెయిట్గా వేయ‌మ‌ని చెప్పాడు. బౌలింగ్ కొన్ని మార్పులు చేయ‌మ‌ని సూచించాడు. బౌలింగ్ ప‌రంగానే కాకుండా మ్యాచ్ ప్ర‌ణాళిక‌ల్లో అశ్విన్ మంచి ప‌ట్టుంది. ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న స‌మ‌యంలో మేము ఇంగ్లాండ్ సిరీస్ గురించి చాలా చ‌ర్చించాం. రూట్ బ్యాటింగ్ చేస్తుంటే ఎక్క‌డ బంతుల‌ను వేయాలి, ఏ ఫీల్డ‌ర్ ద‌గ్గ‌ర‌గా ఉండాలి? లాంటి అంశాల గురించి మాట్లాడుకున్నాం. అని కుల్దీప్ అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *