ప్ర‌మాద‌క‌మైన క‌రోనా డెల్టా వేరియంట్ – నిపుణులు

ఇప్పుడు ఎక్క‌డ చూసిన కొవిడ్ విజృభిస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా సెకండ్ వేవ్‌లో తీవ్ర ప్ర‌భావం చూపింది. ఇండియాలో క‌రోనా విలాయ‌తాడ‌వం చేందుకు డెల్టా వేరియంటే కార‌ణ‌మ‌ని నిపుణులు పేర్కొన్నారు. ఈక్ర‌మంలోనే మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన వైర‌స్‌ను గుర్తించారు. పూణేలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ (ఎన్ ఐవీ) నిర్వ‌హించిన జీనోమ్ సీక్వెన్సింగ్ లో కొవిడ్ వైర‌స్ బీ.1.1.28.2 తాజా వేరియంట్‌ను శాస్త్ర‌వేత్తలు గుర్తించారు. బ్రెజిల్‌, యూకే నుండి వ‌చ్చిన ఇద్ద‌రు ప్ర‌యాణికుల నుండి సేక‌రించిన న‌మూనాల‌ను సేక‌రించి . జ‌న్యుక్ర‌మాల (జీనోమ్ సీక్వెన్సింగ్‌)ను విశ్లేషించ‌గా. బీ.1.1.28.2 వేరియంట్ వెలుగులోకి వ‌చ్చింది. వేరియంట్ను తొమ్మ‌ది సిరియ‌న్ ర‌కానికి చెందిన ఎలుక‌ల్లోప్ర‌వేశ‌పెట్ట‌గా ..ఇన్పెక్ష‌న్ సోకిన వారంలో రోజుల్లోనే ల‌క్ష‌ణాలు బ‌య‌ట‌ప‌డ‌డం ప్రారంభ‌మైంద‌ని ప‌రిశోధ‌కులు తెలిపారు. శ‌రీరంలో ఇన్పెక్ష‌న్ భారీగా వ్యాప్తించ‌డంతో మూడు ఎలుక‌లు చ‌నిపోయాయ‌ని పేర్కొన్నారు.వేరియంట్ తాజా వేరియంట్ శ‌రీర బ‌రువు త‌గ్గించింద‌ని, శ్వాస‌కోశ‌,ఊపిరితిత్తులో స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మైంద‌ని తెలిపారు. ఈ తాజా వేరియంట్ డెల్టా వేరియంట్‌తో స‌మాన‌మ‌ని, ఆల్పా వేరియంట్ కంటే ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు అభిప్రాయ వ్య‌వ్తం చేశారు. అయితే ఈ వైర‌స్ వ్యాక్సిన్ల స‌మ‌ర్థ‌త‌ను తెలుసునేందుకు మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *