పీఎస్ఎల్‌వీ-51 ప్ర‌యోగం సక్సెస్‌-నింగిలోనికి దూసుకెళ్లిన రాకెట్‌….

శ్రీ‌హ‌రికోట‌: ఆదివారం ఉద‌యం 10:24 గంట‌ల‌కు శ్రీ‌హ‌రికోట నుంచి రాకెట్‌ను ఇస్రోశాస్త్ర‌వేత్త‌లు ప్ర‌యోగించారు. ఇస్రో ప్రైవేట్ సంస్థ‌ల భాగ‌స్వామ్యంతో ఇండియా అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ పీఎస్ఎల్‌వీ-సీ51 ప్ర‌యోగం చేప‌ట్టింది. భ‌గ‌వ‌ద్గీత కాపీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫొటో, పేరు, ఆత్మ‌నిర్భ‌ర్ మిష‌న్‌పేరు ,25వేల మంది పేర్ల‌ను.. అమెజానియా-1 శాటిలైట్‌తో పాటు మ‌రో 18 ప్రైవేటు ఉప‌గ్ర‌హాల‌ను రాకెట్ నింగిలోకి మోసుకు వెళ్లింది. న్యూస్పేస్ భార‌త్ లిమిటెడ్ సార‌థ్యంలో నింగిలోకి పంపింది. తొలి వాణిజ్య ఉప‌గ్ర‌హాల‌ను పీఎస్ఎల్‌వీ క‌క్ష‌లో ప్ర‌వేశ‌పెడుతోంది. ఇప్పుడు ఉన్న స‌మాచారం మేర‌కు మూడు ద‌శ‌లు విజ‌య‌వంత‌మ‌య్యాయి. బ్రెజీలియ‌న్ శాటిలైట్ అమెజానియా-1 భూప‌ర్య‌వేక్ష‌ణ‌కు కీల‌కం కాగా.. అమెరికాకు చెందిన స్పేస్‌బీస్ పేరుతో 12 ఉప‌గ్ర‌హాలు, సాయ్‌-1 నానో కాంటాక్ట్‌-2 అనే ఒక ఉప‌గ్ర‌హంతో పాటు యూనిటీశాట్ పేరుతో మూడు యూనివ‌ర్సిటీల విద్యార్థులు త‌యారుచేసిన మూడు ఉప‌గ్ర‌హాలు, స‌తీశ్ ధావ‌న్‌శాట్‌, సింధునేత్ర అనే ఉప‌గ్ర‌హాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *