ఇండియాలో తొలి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఆక్స్‌ఫ‌ర్డ్‌దే..

న్యూఢిల్లీః ఇండియాలో తొలి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ ఆక్స్‌ఫ‌ర్డ్‌దే కావ‌చ్చ‌ని అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి. అయితే దీని కోసం ఇప్పుడు యూకే వైపు చూస్తోంది. ఇండియా.వ‌చ్చేవారం ఈ వ్యాక్సిన్ కు యూకే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయి. ఆదేశం ఓకే చెప్ప‌గానే.. ఇండియాలోనూ ఈ వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి పై తుది నిర్ణ‌యం తీసుకోనున్నారు. మ‌న‌దేశంలో సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్ పేరుతో ఆక్స్‌ఫ‌ర్డ్ వ్యాక్సిన్‌నుత‌యారు చేస్తోంది. బ్రిట‌న్‌లో అనుమ‌తి ప్రక్రియ పూర్త‌వ‌గానే… సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ (సీడీఎస్‌సీవో) లోని కొవిడ్019 పై ఏర్పాటు చేసిన నిపుణులు క‌మిటీ ఈ వ్యాక్సిన్‌పై స‌మీక్ష నిర్వ‌హించ‌నుంది. అందులో కొవిషీల్డ్ భ‌ద్ర‌త‌, ఇమ్యునోజెనిసిటీ డేటాను ప‌రిశీలించి అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి ఇవ్వ‌డంపై తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు అధికార వ‌ర్గాలు వెల్ల‌డించాయి.ఇండియాలో రాబోతున్న తొలి క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కొవిషీల్డే అని ఓ సీనియ‌ర్ అధికారి తెలిపారు. అయితే వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి ఆక్స్‌ఫ‌ర్డ్‌తోపాటు భార‌త్ బయోటెక్‌, ఫైజ‌ర్ కూడా ధ‌ర‌ఖాస్తు చేసుకున్నాయి. ఇందులో భార‌త్ బ‌యోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ ఇంకా మూడో ద‌శ ప్ర‌యోగాల్లోనే ఉండటంతో ఈ వ్యాక్సిన్ రావ‌డానికి ఇంకా స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చు. ఇక ఫైజ‌ర్ విష‌యానికి వ‌స్తే…ఆ సంస్థ నిపుణుల క‌మిటీ ముందు ఇంకా ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌లేదు. ఫైజ‌ర్ వ్యాక్సిన్ కు ఇప్ప‌టికే యూఎస్‌, యూకే, బ‌హ్రోయిన్ అనుమ‌తి ఇచ్చిన విష‌యం తెలిసిందే. సీరమ్ వ్యాక్సిన్‌కు సంబంధించి మ‌రింత డేటా కావాల‌ని గ‌త వార‌మే డ్ర‌గ్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) కోరింది. ఫేజ్‌2,3 ట్ర‌య‌ల్స్‌కు సంబంధించి అప్‌డేట్ చేసిన భ‌ద్ర‌త డేటాను ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేసింది. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా వ్యాక్సిన్ త‌యారు చేసే పుణేలోని సీర‌మ్ ఇన్‌స్ఇట్యూట్ ఆఫ్ ఇండియా .. ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ ,వ్యాక్సిన్ త‌యారీదారు ఆ స్ట్రాజెనెకాల‌తో చేతులు క‌లిపింది. ఇప్ప‌టికే ఇండియాలో 4 కోట్ల డోసులు కొవిషీల్డ్ త‌యారు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *