క‌రోనా టీకా కార్య‌క్ర‌మం కింద కేంద్రం ఏడు కోట్లు….

దిల్లీ: ఇండియాలో కొవిడ్ కోరలు చాస్తున్న వేళ‌… మ‌రిన్ని స‌మూహాల‌కు టీకాలు వేయాల్సి ఉంద‌ని ఎయిమ్స్ డైరెక్ట‌ర్ గులేరియా అన్నారు. జ‌న‌వ‌రి 16న ప్రారంభ‌మైన టీకా కార్య‌క్ర‌మం కింద ఏప్రిల్ ఒక‌టి నుంచి 45 సంవ‌త్స‌రం పైబ‌డిన వారికి టీకాలు ఇస్తోన్న విష‌యం తెలిసిందే. ఈక్ర‌మంలో ఇంకా చిన్న వ‌య‌సు వారిని దీని కిందికి తీసుకురావాల్సిఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఆ విష‌యంలో టీకా ల‌భ్య‌త కీల‌కాంశం కానుందని వెల్ల‌డించారు. తాజాగా గులేరియా మీడియాతో మాట్లాడుతూ ..మ‌న‌ది జ‌నాభా ప‌రంగా పెద్ద దేశం. వ‌యోజ‌నులంద‌రికీ అంటే.. సుమారు 100 కోట్ల మందికి టీకాలు వేయాల్సి ఉంటుంది. అందుకోసం 200 కోట్ల టీకా డోసులు అవ‌స‌రం. కాక‌పోతే అన్ని టీకా డోసుల‌ను పొందే అవ‌కాశం లేదు. అందుకే టీకా స‌మ‌తుల్య‌త‌ను పాటిస్తూ…. ప్రాధాన్య వ‌ర్గాల‌కు టీకాలు అందించాల్సిన అవ‌స‌రం ఉంది. అని స్ప‌ష్ట‌త ఇచ్చారు. టీకా కార్య‌క్ర‌మంలో ఆశించినంత వేగం క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌శ్నించ‌గా…. దిల్లీ ఎయిమ్స్ ఐదు టీకా కేంద్రాలను ఏర్పాటు చేసింద‌ని , నిత్యం 600 మంది టీకాలు వేయించుకుంటున్నార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఒక‌వేళ ప‌దిరోజుల త‌రువాత వ‌చ్చే వారి సంఖ్య 50 గురువారం 996 మందికి టీకాలు వేసామ‌ని, త్వ‌ర‌లోనే 1,000 మార్కును దాటుతామ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. అప్పుడు ఇంత‌కంటే చిన్న‌వ‌య‌సు వారిని టీకా కార్య‌క్ర‌మంలో చేర్చ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఇప్పుడు మూడు ద‌శ‌ల్లో భాగంగా న‌డుస్తోన్న క‌రోనా టీకా కార్య‌క్ర‌మం కింద కేంద్రం ఏడు కోట్ల‌కు పైగా టీకా డోసుల‌ను పంపీణి చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *