సీడబ్ల్యూసీ క‌రోనా పై స‌మావేశం…

న్యూఢిల్లీ: ఇప్పుడు క‌రోనా దేశ‌వ్యాప్తంగా విస్తారిస్తోంది. రోజురోజుకు కొవిడ్ సెకండ్ వేవ్ వేగ‌వంత‌గా విజృభిస్తోంది. ల‌క్ష‌కొద్ది కేసులు న‌మోదవుతున్నాయి.కాంగ్రెస్ వ‌ర్కింగ్ క‌మిటీ (సీడ‌బ్ల్యూసీ) నేడు స‌మావేశం కానుంది.,వీడియో కాన్ప‌రెన్స్ ద్వారా జ‌రిపే ఈ సమావేశానికి కాంగ్రెస్ తాత్కాళిక అధ్య‌క్షురాలు సోనియాగాంధీ అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. ప్ర‌తిరోజూ లక్ష‌ల్లో క‌రోనా తాజా కేసులు వెలుగుచూస్తున్నందున ప‌రిస్థితిని స‌త్వ‌రం అదుపు చేయాల్సిఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ సంగ‌తాన్ని చాలా తీవ్ర‌మైన విష‌యంగా భావిస్తోంది. పార్టీ సుప్రీం క‌మిటీ (డ‌బ్ల్యూసి) ముందుకు ఈ సంగ‌తి తీసుకు వెళ్లాల‌ని అనుకుంటోంది. ఇందుకు సంబంధించిన ఒక తీర్మానాన్ని కూడా సీడిబ్ల్యూసీ స‌మావేశంలో చేసే అవ‌కాశం ఉంది. అని కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. క‌రోనా కేసుల పెరిగిపోతున్న అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నాయ‌క‌త్వం తర‌చు లేవ‌నెత్తుతోంది. దేశ‌వ్యాప్త వ్యాక్సినేష‌న్ డ్రైవ్ న‌త్త‌న‌డ‌క‌న న‌డుస్తుంటంపై కేంద్రంపై విమ‌ర్శ‌లు సైతం గుప్పిస్తోంది. అందరికి వ్యాక్సినేష‌న్ ఇవ్వాలంటూ సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నేరుగా ప్ర‌ధానికి ఈ మ‌ధ్య‌కాలంలో రాసిన లేఖ‌ల్లో విజ్ఞ‌ప్తి చేశారు. వ్యాక్సినేష‌న్ ప్రోగ్రాం కోసం నిధుల కేటాయింపు, పేద ప్ర‌జ‌ల అకౌంట్ల‌లోకి డ‌బ్బులు వేయాల‌ని కోరుతుంది.కాంగ్రెస్ పాలిత ప్రాంతాల సీఎం లు,మంత్రులతో ఇటీవ‌ల స‌మావేశం జ‌రిపారు.సంక్షోభ స‌మ‌యంలో క‌రోనా జాగ్ర‌త్త‌ల‌పై ఇంటింటి ప్ర‌చారం చేప‌ట్టాల‌ని నేత‌ల‌ను సోనియాగాంధీ కోరారు. సామాన్య ప్రజానీకానికి వ్యాక్సిన్ అందించాల‌ని త‌మ‌కు ఉన్నా వ్యాక్సిన్ల కొర‌త ను ఎదుర్కొంటున్నామ‌ని ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఈ స‌మావేశంలో సోనియా దృష్టికి తెచ్చారు. ఆ స‌మావేశం పూర్తి కాగానే సోనియాగాంధీ నేరుగా ప్ర‌ధానికి లేఖ కూడా రాశారు. అవ‌స‌ర‌మైన వారికి ఆర్థిక సాయం అందించాల‌ని, వ్యాక్సిన్ల కొనుగోలుకు రాష్ట్రాల‌ను అనుమంతించాల‌నిమ‌రిన్ని వ్యాక్సిన్ల వినియోగానికి కూడా అనుమ‌తించాల‌ని సోనియాగాంధీ ఆ లేఖ‌లో ప్ర‌ధానికి మూడు విజ్ఞ‌ప్తులు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *