టీమిండియాను వెన‌క్కి నెట్టి ఆస్ట్రేలియా తొలి స్థానానికి వెళ్లింది..

బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా ఆస్ట్రేలియాపై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విష‌యం ద్వారా ఇండియాకు 30 పాయింట్లు వ‌చ్చాయి. దీంతో టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో ఇండియన్ టీమ్ మొత్తం పాయింట్లు 390కి చేరాయి. మ‌రోవైపు ఇదే టెస్ట్‌లో స్లోఓవ‌ర్ రేట్ కార‌ణంగా ఆసీస్ నాలుగు పాయింట్లు పెనాల్టీగా కోల్పోయింది. ఇప్పుడు ఆ టీమ్ ఖాతాలో 322 పాయింట్లు ఉన్నాయి. అయితే టెస్ట్ చాంపియ‌న్‌షిప్ టేబుల్లో మాత్రం ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండ‌గా.. ఇండియా రెండోస్థానంలో ఉంది. ఇలా ఎందుకు అన్న‌ది ప్ర‌స్తుతం చూద్దాం. వ‌రల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్ కు క్వాలిపై అయ్యే విధానాన్ని ఐసీసీ బోర్డు మార్చింది. క్రికెట్ క‌మిటీ సిఫారసు మేర‌కు ఐసీసీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఈ కొత్త రూల్ ప్రకారం ..అత్య‌ధిక ప‌ర్సంటేజ్ పాయింట్లు (పీసీటీ) ఉన్న టీమ్ టాప్‌లో ఉంటుంది. మొత్తం పోటీ ప‌డిన పాయింట్ల‌లో టీమ్ గెలిచిన ప‌ర్సంటేజ్ పాయింట్లు ఇవి. ఆ లెక్క‌న ఆస్ట్రేలియా 420 పాయింట్ల‌కు పోటిగా 322 పాయింట్లు సాధించింఇ. అదే టీమిండియా మాత్రం 540 పాయింట్ల‌కుగాను 390 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఆ లెక్క‌న ఇండియా ప‌ర్సెంటేజ్ పాయింట్లు 72.2 శాతం కాగా.. ఆస్ట్రేలియా ప‌ర్సెంటేజ్ పాయింట్లు 76.6 శాతంగా ఉంది. దీంతో టీమిండియాను వెన‌క్కి నెట్టి ఆస్ట్రేలియా తొలి స్థానానికి వెళ్లింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *