ఎన్ఏఆర్ ఎఫ్ బిఆర్ జాతీయ కీల‌క‌ప్రాజెక్ట్ స‌ల‌హాదారునిగా బిపి ఆచార్య‌..

హైద‌రాబాద్‌: జాతీయ ప్రాజెక్ట్ నేష‌న‌ల్ యానిమ‌ల్ రిసోర్స్ ఫ‌ర్ బ‌యో మెడిక‌ల్ రీసెర్చ్‌( ఎన్ఏఆర్ఎఫ్‌బిఆర్‌) ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడిక‌ల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్ )కు స‌ల‌హాదారుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బిపి ఆచార్య నియ‌మితుల‌య్యారు. శామీపేట స‌మీపంలోని జీనోమ్ వ్యాలీలో 100 ఎక‌రాల్లో ఈ ప్రాజెక్ట్‌నుఏర్పాటుచేస్తున్నారు. జీవోమ్ వ్యాలీలో వ‌ర‌ల్డ్ క్లాస్ లైఫ్‌సైన్స్ క్ల‌స్ట‌ర్ గా తీర్చిదిద్దుతున్నారు. దాదాపు 300 కోట్ల పెట్టుబడితో ప్రాజెక్ట‌ను రూపొందిస్తున్నారు.ఫార్మా, బ‌యోఫార్మా,వ్యాక్సిన్ ప‌రిశ్ర‌మ‌ల‌కు దేశంలోనే ప్రీ క్లీనిక‌ల్ ట్ర‌య‌ల్స్‌ను సేవ‌లు అందించ‌డానికి అవకాశం ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *