లాక్‌డౌన్ తొల‌గించ‌డానికి తొంద‌ర‌ప‌డోద్దు..

హైదరాబాద్‌:దేశంలో కరోనా నియంత్ర‌ణ చేయ‌డానికి అమ‌లు చేస్తున్న లాక్‌డౌన్ ఉప‌సంహ‌రించ‌డంపై చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) స్ప‌ష్టం చేసింది. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను పూర్తి తొల‌గించిన‌ప్పుడు వ‌చ్చే థ‌ర్డ్ వేవ్ గురించి ఆలోచించాల‌ని గుర్తు చేసింది. మూడో విపత్తును నివారించేందుకు బాగా ఆలోచించి, చాలా నెమ్మ‌దిగా, క్ర‌మంగా ఆష్ట దిగ్భంధ‌నాన్ని ఉప‌సంహ‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు స‌ల‌హా ఇచ్చింది. ఆంక్ష‌లను సడ‌లించి, కార్య‌క‌లాపాల‌ను పూర్తిగా ప్రారంభించ‌డ‌మ‌నే అంశం మూడు స్తంభాల చుట్టూ తిరుగుతుంద‌ని పేర్కొంది. వారం మొత్తం మీద కోవిడ్-19 పాజిటివిటీ రేటు 5 శాతం క‌న్నా త‌క్కువ‌గా ఉండ‌టం.ఈ వ్యాధి సోకే అవ‌కాశం ఉన్న‌వారిలో, అంటే వృద్దులు,బ‌హుళ రోగాల‌తో బాధ‌ప‌డే 45 ఏళ్ళ‌క‌న్నా ఎక్కువ వ‌య‌సుగ‌ల‌వారు వంటివారిలో 70శాతం క‌న్నా ఎక్కువ మందికి వ్యాక్సినేష‌న్ జ‌ర‌గ‌డం. ఈ మూడింటినీ ప‌రిశీలించి అన్‌లాక్ ప్ర‌క్రియ‌ను చేపట్ట‌వ‌చ్చున‌ని తెలిపింది. ఐసీఎంఆర్ చీఫ్ డాక్ట‌ర్ బ‌ల‌రామ్ భార్గ‌వ విలేక‌ర్ల సమావేశంలో ముచ్చ‌టిస్తూ,జిల్లా స్థాయిలో క‌ట్ట‌డి ప్రాంతాల ఏర్పాటు,ప‌రీక్ష‌ల పెంపుద‌ల అనేవి స‌మ‌ర్థించ‌ద‌గిన ప‌రిష్కారాలు కావ‌ని స్ప‌ష్టం చేశారు.వ్యాక్సిన్ల‌కు కొర‌త లేద‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *