సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా ద‌క్షిణ మ‌ధ్య రైల్వేప్ర‌త్యేక రైళ్లు…

సంక్రాంతి పండుగ దృష్ట్యా ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్లు న‌డుపుతుంది. ప‌లు మార్గాల్లో న‌డుప‌నున్న రైళ్ల వివ‌రాల‌ను అధికారులు ప్ర‌క‌టించారు. సికింద్రాబాద్ -బెర్హంపూర్కు (07449) ఈనెల 9 నుంచి 16వ తేదీ వ‌ర‌కు,బెర్హంపూర్ నుంచి సికింద్రాబాద్‌కు(07450) ఈనెల 10నుంచి 17వ తేదీ వ‌ర‌కు క్లోన్ రైళ్లు న‌డుస్తాయి. హైద‌రాబాద్‌-విశాఖ‌ప‌ట్నం(07451)ఈనెల 9నుంచి 16వ‌తేదీ వ‌ర‌కు, తిరుగుప్ర‌యాణంలో ఇదే రైలు విశాఖ‌ప‌ట్నం నుంచి సికింద్రాబాద్ 10నుంచి 17 వ‌తేదీ వ‌ర‌కు రాక‌పోక‌లు సాగిస్తాయి. సికింద్రాబాద్ నుంచి తిరుప‌తి(07453) ఈ నెల 12వ తేదీ ప్ర‌త్యేక రైలు ఉంటుంది. రైల్వే మ‌ర‌మ్మ‌తు ప‌నుల కార‌ణంగా ప‌లు రైళ్ల రాక‌పోక‌ల్లో మార్పులు చేయ‌డంతో పాటు కొన్నింటిని ర‌ద్దు చేసిన‌ట్టు ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే అధికారులు చెప్పారు. విజ‌య‌వాద‌-హుబ్లీ-విజ‌య‌వాడ‌(07226) ,హుబ్లీ-హైద‌రాబాద్‌(07319),హైద‌రాబాద్-హుబ్లీ(07320)మ‌ధ్య ప్ర‌తి రోజు న‌డిచే రైళ్ల‌ను 20మంది నుంచి 29తేదీల మ‌ధ్య రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. నాలుగు రైళ్ల‌ను మ‌ళ్లీంచిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు. కేఎస్ ఆర్ బెంగాళూరు సిటీ-అజ్మీర్‌(06205), అజ్మీర్‌-కేఎస్ ఆర్ బెంగాళూరు (06206) ,జోధ్‌పూర్ –కేఎస్ ఆర్ బెంగుళూరు సిటీ (06533), కేఎస్ ఆర్ బెంగుళూరు సిటీ-జోధ్‌పూర్ (06543) మ‌ధ్య న‌డిచే రైళ్ల‌ను కూసుగ‌లి బైపాస్‌, నావ‌లూర్ స్టేష‌న్ల మీదుగా న‌డుపుతామ‌ని అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *