ఫాస్ట్‌పుడ్ సెంట‌ర్‌కి వ‌చ్చిన సోనూసూద్‌…

హైద‌రాబాద్ః క‌రోనా స‌మ‌యంలో వ‌ల‌స‌కార్మికుల‌కు కొండంత అండ‌గా నిల‌బ‌డి వారిని ఆదుకున్నారు. లాక్‌డౌన్ మొద‌లైన నాటి నుండి ఆయ‌న ఇత‌ర ప్రాంతాల్లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికుల‌ను సొంత గ్రామాల‌కు త‌ర‌లించ‌డానికి ప్ర‌త్యేక బ‌స్సులు, రైళ్ల‌ను ఏర్పుటు చేసాడు. ఇక ప్ర‌స్తుతం ఏకంగా కేర‌ళ‌లో చిక్కుకున్న ఒడిస్సా అమ్మాయిల‌ను సొంత గ్రామాల‌కు చేర్చ‌డానికి ప్ర‌త్యేక విమానాన్ని ఏర్పాటు చేసాడు. విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయ విద్యార్థుల‌ను స్వ‌దేశానికి ర‌ప్పించారు. అంతేకాకుండా క‌ష్టాలు చెప్పుకున్న ప్ర‌తి ఒక్క‌రికి లేద‌న‌కుండా సాయం చేసాడు. రీల్ లో చేసేది విల‌న్ పాత్ర‌లే అయినా రియ‌ల్ లైఫ్ లో మాత్రం సూప‌ర్‌హీరో అనిపించుకున్నాడు. దేశ‌మంతా సోనూసూద్ ను ప్ర‌శంశ‌ల‌తో ముంచేస్తుంది. ఇటీవ‌ల సోనూసూద్‌కు తెలంగాణ‌లోని సిద్దిపేట జిల్లాలో గుడి క‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా హైద‌రాబాద్‌లోని బేగంపేట కు చెందిన అనిల్ అనే యువ‌కుడు త‌న ఫాస్ట్‌పుడ్ సెంట‌ర్ కు సోనుసూద్ ఫాస్ట్‌పుడ్ సెంట‌ర్ అని పేరు పెట్ట‌డం జ‌రిగింది. సోనుసూద్ పేరు పెట్ట‌డంతో త‌న‌కు బిజినెస్ రెట్టింపు అయ్యింద‌ని అనిల్ తెలిపారు. శుక్ర‌వారం హైద‌రాబాద్‌లోని బేగం పేట‌లోని సోనూసూద్ పాస్ట్ పుడ్ సెంట‌ర్‌ను సోనూసుద్ స‌డ‌న్ విజిట్ చేశారు.‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *