కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి…

హైదరాబాద్ ఃఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.కూక‌ట్‌ప‌ల్లిలోని నివాసంలో ఆమెతోపాటు బంధువుల‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అఖిల ప్రియ‌ను అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. బోయిన్‌ప‌ల్లిలో చోటుచేసుకున్న కిడ్నాప్ కేసులోఅఖిల‌ప్రియ‌ను అరెస్ట్ చేసిన‌ట్లు స‌మాచారం. అయితే ఆమెభ‌ర్త భార్గ‌వ‌రామ్ ఇప్పుడు పరారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అఖిల‌ప్రియ‌ను బేగంపేట‌లోని లెర్నింగ్ సెంట‌ర్‌కు పోలీసులు తీసుకెళ్లి ప్ర‌శ్నించారు. ఆ త‌రువాత వైద్య ప‌రీక్ష‌ల నిమిత్తం గాందీ ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డి నుంచి సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో అఖిల‌ప్రియ‌ను హాజ‌రుప‌ర‌చ‌నున్నారు. బోయ‌న్‌ప‌ల్లిలో నిన్న రాత్రి బ్యాడ్మింట‌న్ మాజీ క్రీడాకారుడు ప్ర‌వీణ్రావు, ఆయ‌న సోద‌రుల అప‌హ‌ర‌ణ ప్ర‌మేయంపై ఫిర్యాదులు రావ‌డంతో పోలీసులు ఆ దివ‌గా విచార‌ణ చేప‌ట్టారు. ప్రాథ‌మిక స‌మాచారం సేక‌రించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త కొన్ని రోజులుగా ఓ భూవివాదానికి సంబంధించి ప్ర‌వీణ్ రావు కుటుంబానికి ,భూమా అఖిల ప్రియ కుటుంబానికి మ‌ధ్య గొడ‌వ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. సికింద్రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లి మ‌నోవికాస్ న‌గ‌ర్ లోని త‌మ స్వ‌గృహంలో ఉన్న ప్ర‌వీణ్‌రావు, ఆయ‌న సోద‌రులు సునీల్ రావు, న‌వీన్‌రావును మంగ‌ళ‌వారం రాత్రి 7.20 గంట‌ల స‌మ‌యంలో సినీ ఫ‌క్కీలో దుండ‌గులు అప‌హ‌రించారు.
ముగ్గురు సోద‌రుల‌ను బెదిరించి వారితో పాటు ల్యాప్‌టాప్‌, చ‌ర‌వాణిల‌ను కూడా ప‌ట్టుకుపోయారు. ఆ ముగ్గురు కిడ్నాప్‌న‌కు గురైన‌ట్లు హైద‌రాబాద్ సీపీ అంజ‌నీకుమార్ స్ప‌ష్టం చేశారు. బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ట‌స్క్‌ఫోర్స్ ముగ్గురిని వికారాబాద్‌లో గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *