మార్పు కోసం మ‌నం క‌లిసి పోరాడుదాం- ష‌ర్మిల‌

హైద‌రాబాద్‌: వైఎస్‌ష‌ర్మిల ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం తాను ఎంత‌టి పోరాటానికైనా సిద్ధ‌ము, నిరుద్యోగులు అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌న్నారు.నేడు మార్పు తేవాల్సిందే. ఆ మార్పు కోసం మ‌నం క‌లిసి పోరాడుదాం. అని ష‌ర్మిల ట్వీట్ చేశారు. కాగా… ఉద్యోగ నోటీఫికేష‌న్లు లేవ‌ని ఇక వ‌చ్చే అవ‌కాశం లేద‌ని ఇప్ప‌టికే వ‌రంగ‌ల్‌కు చెందిన ఒక నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొత్త‌గా న‌ల్లగొండ జిల్లా చండూరు మండ‌లం పుల్లెంల‌లో మ‌రో నిరుద్యోగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఎలాంటి నోటిఫికేష‌న్లు వెలువ‌డ‌క‌పోవ‌డంతో .. మ‌న‌స్తాపానికి గురైన పాక శ్రీ‌కాంత్ (25) అనే నిరుద్యోగి పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.మీ అక్కగా నేను కోరేది ఒక్క‌టే. ద‌య‌చేసి ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డొద్దు. రేప‌టి భ‌విష్య‌త్తు కోసం … నేడు నోటిఫికేష‌న్లు లేవ‌ని ఆ మార్పు కోసం క‌లిసి పోరాడుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *