ఆర్టీసీ ఉద్యోగుల‌కు మే30 నుండి జూన్ 1 వ‌ర‌కు క‌రోనా టీకా……

హైద‌రాబాద్‌: ఇప్పుడు దేశంలో మొత్తం క‌రోనా విల‌య‌తాడ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌తి ఒక పౌరుడు వ్యాక్సిన్ వేసుకోవాల‌ని ప్ర‌భుత్వం పిలుపునిచ్చింది, ఈ సంద‌ర్భంలో కోవిడ్ రోగం అడ్డుకునేందుకు రాష్ట్ర‌వాప్తంగా సూప‌ర్ స్ప్రెడ‌ర్ల‌కు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఆదివారం నుండి మూడు దినాల పాటు ఆర్టీసీ డ్రైవ‌ర్లు, కండ‌క్ల‌ర్లు, సిబ్బందికి టీకా ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు. దీంతో ఎంజీబీఎస్‌తో పాటు ప‌లు జిల్లా కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభమైంది. ఎంజీబీఎస్‌లో కొన‌సాగుతున్న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను ఆర్టీసీ ఎండీ సునీల్ శ‌ర్మ ప‌రిశీలించారు. ఈ రోజు 16 వేల మందికి వ్యాక్సినేష‌న్ ఇస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. తార్నా క ఆర్టీసీ ఆస్ప‌త్రిలో ఆక్సిజ‌న్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. ప్ర‌తి ఆర్టీసీ డ్రైవ‌ర్‌, కండ‌క్ట‌ర్ వ్యాక్సిన్‌ను తీసుకోవాల‌ని సునీల్‌శ‌ర్మ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *