ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల‌లో భారీ కుంభ‌కోణం …

హైద‌రాబాద్‌: ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా విలాయ‌తాడ‌వం చేస్తుంది.ఇలాంటి త‌రుణంలో తెలంగాణ స‌ర్కారు మందులు, ఆక్సిజ‌న్ కొర‌త లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయిన‌ప్ప‌టికీ ప‌లు ఆస్ప‌త్రుల్లో బెడ్లు, మందులు లేవంటే కంప్ల‌యింట్లు వ‌స్తూనే ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో ఎంపీ రేవంత్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇప్ప‌టికేఈ ఎంపీ దేవ‌ర‌యంజాల్ భూముల‌పై ఆరోప‌ణ‌లు చేసి ,ఆధారాల‌తో స‌హా టీఆర్ ఎస్ మంత్రులు అక్ర‌మాల‌ను మీడియాకు విడుద‌ల చేశారు. దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం కూడా విచార‌ణ జ‌రుపుతోంది. దీంతో ఆయ‌న‌కు రాష్ట్ర వ్యాప్తంగా పుల్ క్రేజ్ వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఏకంగా ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల‌లో భారీ కుంభ‌కోణం జ‌రిగింద‌ని బాంబు పేల్చారు. వంద‌ల కోట్లు అక్ర‌మాలు జ‌రిగాయంటూ మ‌రోసారిమీడియా ముందుకు వ‌చ్చారు. అయితే ఈసారి ప్ర‌త్యేకంగా ఎవ‌రి పేరు చెప్ప‌కుండా ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేశారు. ఈ సంగ‌తిలో విచార‌ణ జ‌ర‌పాలంటూ తాను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడికి కూడా లేఖ రాశాన‌ని వివ‌రించారు. మ‌రి ఈ కుంభ‌కోణంలో వ్య‌వ‌హారం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి. ఏదేమైనా ఎంపీ రేవంత్ రెడ్డి వ‌రుస ఆరోప‌ణ‌లు టీఆర్ ఎస్‌కు కునుకు లేకుండా చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *