ప్రాణం ద‌క్కాలి… రైలులో గుండె త‌ర‌లింపు…

హైద‌రాబాద్‌: మెట్రో రైలు అధికారుల స‌హ‌కారంతో అపోలో ఆస్ప‌త్రి వైద్యులు విజ‌య‌వంతంగా గుండెను త‌ర‌లించారు. న‌ల్ల‌గొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆరైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మ‌రో వ్య‌క్తికి అమ‌ర్చ‌నున్నారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న మ‌రో వ్య‌క్తికి గుండె మార్పిడి శ‌స్త చికిత్స‌కు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్ట‌ర్ గోకులే నేతృత్వంలో ఈ శాస్త్ర చికిత్స నిర్వ‌హించ‌నున్నారు. ఎల్బీన‌గ‌ర్ కామినేని ఆస్ప‌త్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రికి గుండెను త‌ర‌లించారు. నాగోలు మెట్రో స్టేష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వ‌ర‌కు గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రో మార్గాన్ని వైద్యులు ఎంచుకున్నారు. మెట్రో రైలు అధికారాలకు ఆస్ప‌త్రి సిబ్బంది స‌మాచారం ఇవ్వ‌డంతో ఈ ఏర్పాట్లు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *