సామూహిక వేడుక‌లు,స‌మావేశాల‌పై నిషేదం….

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 31 వ‌ర‌కు సామూహిక వేడుక‌లు, స‌మావేశాల‌పై నిషేదం విధించారు. హోలీ, ఉగాది, శ్రీ‌రామ‌న‌వ‌మి, ష‌బే ఇబ‌ర‌త్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. దీంతోపాటుగా రంజాన్‌, గుడ్ ఫ్రైడే, మ‌హావీర్ జ‌యంతి వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించారు. ఆంక్ష‌ల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు. మాస్క్‌లు ధ‌రించ‌డాన్ని ప్ర‌భుత్వం త‌ప్ప‌నిస‌రి చేసింది. మాస్క్‌లు వినియోగించ‌క‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన స‌రిహ‌ద్దు జిల్లాల తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ముంబై నుంచి రైళ్లు కూడా నిజామాబాద్ మీదుగానే హైద‌రాబాద్‌కు న‌డుస్తున్నాయి. వీటి ద్వారా ప్ర‌తిరోజు వ‌చ్చి వెళ్లేవారు ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల ఆప్ర‌భావం తెలంగాణ స‌రిహ‌ద్దు జిల్లాల‌పైనా ప‌డుతోంది. ఈ సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రితో పోలిస్తే మార్చిలోనే ఈ జిల్లాల్లో క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోద‌య్యాయి. క‌రోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నప్ప‌టికీ రాష్ట్రంలో ఎట్టి ప‌రిస్థితుల్లో లౌక్‌డౌన్ విధించ‌బోమ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *