ఐటీఐఆర్ రాలేద‌ని కేటీఆర్ స‌న్నాయి నొక్కులు-రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి విప‌ప‌క్ష‌ల మ‌ధ్య ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో జోరుగా జ‌రుగుతుంది. శుక్ర‌వారం ఎంపీ రేవంత్‌రెడ్డి కూక‌ట్ ప‌ల్లిలో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు. ఇరు పార్టీల‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో సీఎం కేసీఆర్‌, కేంద్రంలో మోదీ ప్ర‌భుత్వం దొందు దొందే ప్ర‌జ‌ల‌ను పాత‌ల లోకాన్ని తోక్కుతున్నాయి. రెండుపార్టీలు చోక్క‌కు మంచిమ‌ల్ల తిరుగ‌మల్ల ‌లేక వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని విమ‌ర్శించారు.ఐటీఐఆర్ రాలేద‌ని కేటీఆర్ స‌న్నాయి నొక్కులు నొక్కుతున్నార‌ని, ఆ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో జంత‌ర్‌మంత‌ర్ ద‌గ్గ‌ర ఆమ‌ర‌ణ దీక్ష చేద్దామ‌ని రేవంత్ పిలుపునిచ్చారు. కేటీఆర్‌కు ద‌మ్ముంటే త‌న స‌వాల్‌ను స్వీక‌రించాల‌న్నారు.మోదీ అంటే కేసీఆర్‌కు చ‌ల‌జ‌ర్వ‌మ‌ని వ్యంగ్యాస్త్రం సంధించారు. ల‌క్షా 91 వేల ఉద్యోగాలు ఎప్పుడు భ‌ర్తీ చేస్తారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.తెలంగాణ‌కు అన్యాయం చేస్తున్న మోదీతో ఎందుకు జ‌త‌క‌ట్టాడో కేసీఆర్ చెప్పాల‌న్నారు. విజ్ఞులైన ప‌ట్ట‌భ‌ద్రులు ఆలోచించి ఓటు వేసి.. త‌మ పార్టీ అభ్య‌ర్థి చిన్నారెడ్డిని గెలిపించాల‌ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *