అపోలో హాస్పిట‌ల్స్ లో వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది….

హైద‌రాబాద్‌: ఇప్పుడు క‌రోనా తెలంగాణ రాష్ట్రంలో క‌ర‌ళా నృత్యం చేస్తున్న విషయం తెలిసిందే. క‌రోనా పై ఉద్య‌మానికి కొవిషిల్డ్‌, కొవాగ్జిన్‌తో పాటు ఇండియాలో అత్య‌వ‌స‌ర వినియోగానికి అందుబాటులోకి వ‌చ్చిన స్పుత్నిక్‌..వి.. వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. దీనికి సంబంధించిన సాఫ్ట్ లాంచ్‌ను అపోలో హాస్పిట‌ల్స్ ఈ ఉద‌యం ఆవిష్క‌రించింది. డా. రెడ్డిస్ సిబ్బంది అశోక్ కు స్పుత్నిక్ తొలి డోసు వేసి వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను మొదలుపెట్టింది. డాక్ట‌ర్ రెడ్డీస్ భాగ‌స్వామ్యంతో అపోలో గ్రూప్ ఆసుప‌త్రుల్లో వ్యాక్సినేష‌న్ పైలెట్ ప్రాజెక్ట్ ను అపోలో గ్రూప్ ప్రెసిండెంట్ డా. కె. హ‌రిప్ర‌సాద్‌, డా. రెడ్డీస్ సీఈవో ఎం.వి.ర‌మ‌ణ ప్రారంభించారు. హైద‌రాబాద్‌, విశాఖ‌ప‌ట్నంలలో ఏక‌కాలంలో ఈ వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభ‌మైంది. స్పుత్నీక్‌-వి, వ్యాక్సిన్‌ను భార‌త్ లోత‌యారీ, పంపిణీకి డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్స్ ర‌ష్య‌న్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ తో ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *