న్యాయ‌వాదుల హ‌త్య కేసు సుమోటోగా స్వీక‌రించిన హైకోర్టు…

హైద‌రాబాద్‌: న‌డ్డిరోడ్డుపై న్యాయ‌వాద దంప‌తుల‌ను హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే.న్యాయ‌వాదులైన గ‌ట్టు వామ‌న్‌రావు, పీవీ నాగ‌మ‌ణి దంప‌తుల హత్య కేసును హైకోర్టు సుమోటోగా స్వీక‌రించింది. ఈ హ‌త్య‌కు సంబంధించిన అన్ని ర‌కాల ఆధారాలు ప‌క‌డ్బందీగా సేక‌రించాల‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ సంవ‌త్స‌రం మార్చ 1 వ‌తేదీ వ‌ర‌కు స‌మ‌గ్ర‌మైన నివేదిక ఇవ్వాల‌ని ఏజీని ఆదేశించిన హైకోర్టు.. ప్ర‌భుత్వానికి, పోలీసు శాఖ‌కు నోటీసులు జారీ చేసింది. హత్య జ‌రిగిన చోట అన్ని ఆధారాల‌ను సేక‌రించి, కేసుకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుపాల‌ని ఆదేశించింది. హ‌త్య జ‌రిగిన స‌మ‌యంలో అక్క‌డున్న ఆర్టీసీ బ‌స్సుల్లోని ప్ర‌యాణికుల‌ను గుర్తించి.. వాళ్ల‌ను సాక్షులుగా చేర్చాల‌ని కోర్టు తెలిపింది. హ‌త్యకు సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయ‌ని, వాటిని భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని సూచించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను మార్చి 1వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
పోలీసుశాఖ అప్ర‌మ‌త్తం : ఏజీ
న్యాయ‌వాదులైన వామ‌న్ , నాగ‌మణి హ‌త్య జ‌రిగిన వెంట‌నే పోలీసు శాఖ అప్ర‌మ‌త్త‌మైంద‌ని కోర్టుకు అడ్వ‌
కేట్ జ‌న‌ర‌ల్ తెలిపారు. హంత‌కుల‌ను అతి త్వ‌ర‌లోనే అదుపులోకి తీసుకుంటామ‌ని ఆయ‌న కోర్టుకు చెప్పారు. షాక్‌కు గుర‌య్యాం: సీజే
న్యాయ‌వాది వామ‌న్‌రావు,ఆయ‌న స‌తీమ‌ణి నాగ‌మ‌ణి హ‌త్య‌తో షాక్ కు గుర‌య్యామ‌ని హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ హిమా కోహ్లీ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *