తెలంగాణ బోర్డ‌ర్‌లోకి ఏపీ లాయ‌ర్ల‌కు నో ఎంట్రీ…..

అమ‌రావ‌తి: క‌ర్ప్యూపేరుతో తెలంగాణ బోర్డ‌ర్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ న్యాయ‌వాదుల‌ను పోలీసులు అడ్డుకుంటున్నార‌ని న్యాయ‌వాది డీఎస్ య‌న్‌వి ప్ర‌సాద్ బాబు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఉమ్మ‌డి రాజ‌ధానిపై హైదార‌బాద్ ఇంకా మూడు సంవ‌త్స‌రాలు ఉంద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు.తెలంగాణ‌ బోర్డ‌ర్‌లో ఏపి న్యాయ‌వాదుల‌ను నిలిపివేయ‌డంతో సాధ‌న‌కు ఇబ్బందిగా మారింద‌ని తెలిపారు. ఏపీ, తెలంగాణ‌లోకార్యాల‌యాలు ఉన్నాయ‌ని ,రాక‌పోక‌లు నిలిపివేయడంతో ఇబ్బందులకు గుర‌వుతున్నామ‌ని కోర్డుకి తెలిపారు. దీంతో తెలంగాణ ప్ర‌భుత్వ ఏజీని ధ‌ర్మాస‌నం వివ‌ర‌ణ అడిగింది. తెలంగాణ బోర్డ‌ర్‌లో ఏపీ న్యాయ‌వాదుల‌ను ఎందుకు నిలిపివేస్తున్నారో బుధ‌వారం ధ‌ర్మాస‌నం ముందు ఉంచుతామ‌ని కోర్టుకు తెలంగాణ ప్ర‌భుత్వ ఏజీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *