అవ‌స‌రం ఉంటేనే బ‌య‌టికి రావాలి- ఈట‌ల‌

హైద‌రాబాద్‌: తెలంగాణ‌రాష్ట్రంలో కొవిడ్ ఇంత‌కుముందుకంటే వేగం విస్త‌రిస్తోన్న సంద‌ర్భంలో ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నాల‌ని రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పేర్కొన్నారు.. తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిన్ కొర‌త ఉన్న‌దని కొత‌ర‌లేకుండా ఏర్పాటు చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.‌రీంన‌గ‌ర్ జిల్లా హూజూరాబాద్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన త‌రువాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 25 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వారికి టీకా ఇవ్వాల‌ని కేంద్ర మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను కోరిన‌ట్లు ఈట‌ల చెప్పారు. అభ్య‌ర్థ‌న‌పై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని.. కానీ హామీ మాత్రం ఇవ్వ‌లేద‌న్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూ విధించే ఆస్కారం లేద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. అవ‌స‌రం ఉంటే త‌ప్ప ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *