రైతు స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌భుత్వం జాప్యం….

న్యూఢిల్లీ: కేంద్ర వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా తాము ఆందోళన మొద‌లుపెట్టి రెండు నెల‌లు పూర్త‌యినా ప్ర‌భుత్వం మాత్రం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డంలేద‌ని అఖిల భారత కిసాన్ మ‌హాస‌భ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ హ‌న‌న్ మొహ‌ల్లా విమ‌ర్శించారు. రెండు నెల‌లుగా చ‌లిలో ఎన్నో క‌ష్టాలు అనుభ‌విస్తూ ఆందోళ‌న కొన‌సాగిస్తున్నామ‌ని, విప‌రీత‌మైన చ‌లి కార‌ణంగా చ‌చ్చిపోతున్నామ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. అయినా ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తూ చ‌ర్చ‌ల కోసం తేదీల మీద తేదీలు ప్ర‌క‌టిస్తున్న‌ద‌ని మండిప‌డ్డారు. ప్ర‌భుత్వానికి త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌నే ఉద్దేశం లేద‌ని, చ‌ర్చ‌ల పేరుతో కాల‌యాప‌న చేస్తూ తామే విసుగుపుట్టి ఆందోళ‌న విర‌మించేలా చేయాల‌నేది ప్ర‌భుత్వ కుట్ర అని హ‌న‌న్‌మొహ‌ల్లా ఆరోపించారు. కాగా, శాంతియుతంగా జ‌రుగుతున్న త‌మ ఆందోళ‌న‌ను కొంద‌రు ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుదారులు హింస‌పూరితంగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని హ‌ర్యానా కిసాన్ సంఘ‌ర్ష్ స‌మితి క‌న్వీన‌ర్ మ‌న్ దీప్ న‌త్వాన్ విమ‌ర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *