జీహెచ్ ఎంసీకీ జాతీయ స్థాయిలో పుర‌స్కారం…

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో హైద‌రాబాద్ న‌గ‌రం లో వ్య‌ర్థాల సేక‌ర‌ణ‌, త‌ర‌లింపు ,నిర్వ‌హ‌ణ‌లో సాంకేతిక విధానాలు అవ‌లంభిస్తోన్న జీహెచ్ ఎంసీకి జాతీయ స్థాయిలో పుర‌స్కారం ద‌క్కింది. ఇండియా ట్రేడ్ ప్ర‌మోష‌న్ ఆర్గ‌నైజేష‌న్‌, డిపార్ట్ మెంట్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఎగ్జిబిష‌న్స్ గ్రూప్ సంయుక్తాధ్వ‌ర్యంలో ఢిల్లీలో నిర్వ‌హించిన 6వ స్మార్ట్ సిటీస్ ఎక్స్‌పో ముగింపు సంద‌ర్బంగా జీహెచ్ఎంసీ అద‌న‌పు క‌మిష‌నర్ బ‌దావ‌త్ సంతోష్ శుక్ర‌వారం అవార్డు అందుకున్నారు. సాంకేతిక ప‌రిజ్ఞానం, ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌మైన సెకండ‌రీ ట్రాన్స్ పోర్ట్‌, అండ్ క‌లెక్ష‌న్ పాయింట్స్ ఎస్‌సీటీపీ) ఏర్పాటు, కంపాక్ట్ ట్రాన్స్ పోర్ట్ వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చినందున స్మార్ట్ వేస్ట్ డిస్పోజ‌బుల్ ప్రాజెక్టు అవార్డు ద‌క్కింది. ఆటోమేటేడ్ విధానంలో పనిచేసే ఎస్ టీపీలు, స్మార్ట్ కంపార్ట‌ర్‌ల ఏర్పాటు దేశంలోనే మొద‌టి సార‌ని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. అవార్డు రావ‌డంపై సంస్థ వ‌ర్గాలు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *