ఇండియాన్ ఎయిర్ ఫోర్స్‌కు శుభ‌వార్త‌- త‌ర్వ‌లో 10 రాఫెల్ జెట్స్‌…

న్యూఢిల్లీ:త‌్వ‌ర‌లోనే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు క‌నిసం మ‌రో10 రాఫెల్ జెట్స్ రానున్నాయి.ఇంత‌కుముందే అంబాలాలోని 17 స్క్వాడ్ర‌న్‌లో 11 రాఫెల్స్ ఉండ‌గా… ఈ కొత్త రాఫెల్స్ తో వీటీ సంఖ్య 21కి చేర‌నుంది. రానున్న రెండు, మూడు రోజుల్లోనే ఫ్రాన్స్ నుంచి నేరుగా 3 రాఫెర్స్ భార‌త్‌కు రానున్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. వీటికి గ‌గ‌న‌తంలోనే తిరిగి ఇంధ‌నం నింపుకునే సామ‌ర్థ్యం ఉన్న‌ద‌ని తెలిపాయి. ఇక వ‌చ్చే నెల‌లో మ‌రో7 నుంచి 8 రాఫెల్స్ వ‌స్తుండ‌టంతో భార‌త్ ఎయిర్‌ఫోర్స్ మ‌రింత బ‌లోపేతం కానున్న‌ట్లు ఆ వ‌ర్గాలు చెప్పాము. గ‌త సంవ‌త్స‌రం జూలై-ఆగ‌స్టు నుంచి భార‌త్ ఎయిర్‌ఫోర్స్‌లోకి రాఫెల్స్ రావ‌డం ప్రారంభించాయి. చైనాతో ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నేప‌థ్యంలోఈ రాఫెన్స్‌ను తూర్పు ల‌ఢాక్ ప్రాంతంలో పెట్రోలింగ్ కోసం ఉంచారు. నూతంగా రానున్న రాఫెల్ విమానాలు కూడా మొద‌ట అంబాలాలోనే ఉండ‌నున్నాయి. 2016లో ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రాఫెల్స్
జెట్స్ కోసం భార‌త్ ఆర్డ‌ర్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *