ఐదు బ‌ట్ట‌ల షాపులు అగ్ని ఆహుత‌య్యాయి-కోఠిలో అగ్ని ప్ర‌మాదం…

హైద‌రాబాద్‌:హైద‌రాబాద్ లో కోఠి అంటేనే ఒక ప్ర‌త్యేక అక్క‌డ అన్ని రకాల వ‌స్తువులు,బ‌ట్ట‌లు, ఇత‌ర సామాన్లు దొరుకుతాయి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. శ‌నివారం రాత్రి షాపులు మూవీవేసిన య‌జ‌మానులు ఇంటి వెళ్లి న త‌రువాత ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో దుకాణంలో ఎవ‌రూ లేక‌పోవ‌డంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఐదు బ‌ట్ట‌ల షాపులు అగ్నికి ఆహుత‌య్యాయి. ప్ర‌మాదం గురించి తెలుసుకున్న దుకాణ య‌జ‌మానులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని అగ్నికి ఆహుత‌వుతున్న త‌మ షాపుల‌ను చూసి క‌న్నీటి ప‌ర్వంత‌మ‌య్యారు. ఒక ద‌శ‌లో దుకాణాల్లోకి వెళ్లి బ‌ట్ట‌ల‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని… అక్క‌డి నుంచి పంపించివేశారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ సిబ్బంది వెంట‌నే రంగంలోకి మంట‌ల‌ను అదుపులోకి తీసుకువ‌చ్చారు. 40 ఏళ్లుగా కోఠిలోనే బ‌ట్ట‌ల దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవ‌నం కొన‌సాగిస్తున్నామ‌ని, ప్ర‌మాదంతో తాము అన్నీ కోల్పోయి పూర్తిగా రోడ్డున ప‌డ్డామ‌ని షాపుల నిర్వాహాకులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ల‌క్ష‌లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసిన ఈమ‌ధ్య కాలంలో స్టాక్‌ను తీసుకువ‌చ్చిన‌ట్లు వాపోయారు. ప్ర‌మాదంతో ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డ‌డంతో పోలీసులు వాహ‌నాల‌ను ఆంధ్రాబ్యాంక్ వైపు రాకుండా మ‌ళ్లించారు. అయితే, షార్ట్ స‌ర్క్యూట్ తో ప్ర‌మాదం జ‌రిగి ఉంటుంద‌ని పోలీసులు భావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *