ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు విద్య‌, ఉద్యోగ అవ‌కాశాల్లో ప‌ది శాతం..

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు (ఈ. డ‌బ్ల్యూ.ఎస్‌) ప‌దిశాతం రిజ‌ర్వేష‌న్ సౌక‌ర్యం అమ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్లు ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్ రావు వెల్ల‌డించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ సంగ‌తిపై ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష నిర్వ‌హించి, త‌గు ఆదేశాలు జారీ చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు విద్య‌, ఉద్యోగ అవ‌కాశాల్లో ప‌ది శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం అన్నారు. ఇప్పుడు రిజ‌ర్వేష‌న్లు పొందుతున్న వ‌ర్గాల‌కు త‌మ రిజ‌ర్వేష‌న్లను య‌థావిధిగా కొన‌సాగిస్తూనే రాష్ట్రంలో ఈ డ‌బ్ల్యూఎస్‌ల‌కు 10శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. రాష్ట్రంలో ఇప్ప‌టికే బ‌ల‌హీన వ‌ర్గాల‌కు 50శాతం మేర రిజ‌ర్వేష‌న్లు అమ‌లు అవుతున్నాయి. ఈ డ‌బ్ల్యూఎస్ తో క‌లుపుకుని ఇక‌పై 60శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌ల‌వుతాయ‌ని సీఎం పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *