ఈ ఇద్ద‌రూ 113 పరుగులు జోడించి కీల‌క‌మైన ఆధిక్యాన్ని క‌ట్ట‌బెట్టారు

అహ్మ‌ద్‌బాద్‌: భార‌త్ జ‌ట్టుకు ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌పై ప‌ట్టు బిగించింది. పంత్ ఔటైన త‌రువాత కూడా ఇద్ద‌రూ ఇంగ్లండ్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్నారు. ఎమినిదో వికెట్‌కు ఇప్ప‌టికే 35 ప‌రుగులు జోడించారు. ఇంత‌కుముందు మిడిలార్డ‌ర్ విఫ‌ల‌మ‌వ‌డంతో ఒక ద‌శ‌లో భార‌త్ జ‌ట్టుకు146 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన‌ట్లు క‌నిపించింది. తొలి ఇన్నింగ్స్‌లో కీల‌క‌మైన ఆధిక్యం సంపాదించింది. రిష‌బ్‌పంత్‌(101) సెంచ‌రీతోపాటు ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్‌(60 నాటౌట్‌) హాఫ్ సెంచ‌రీ చేయ‌డంతో రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇండియ‌న్ టీమ్ 7 వికెట్ల‌కు294 ప‌రుగులు చేసింది. దీంతో ఇప్పుడు తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ సేన‌89 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో సుంద‌ర్‌తోపాటు అక్ష‌ర్ ప‌టేల్‌(11) ఉన్నాడు. కెప్టెన్ కోహ్లీ(0)తోపాటు ర‌హానే (27), అశ్విన్‌(13) పుజారా(17) విఫ‌ల‌మ‌య్యారు.రోహ‌త్‌49 ప‌రుగులు చేసి ఔట‌య్యాడు.ఈ ద‌శ‌లో పంత్, సుంద‌ర్‌టీమ్‌ను ఆదుకున్నాడు. లీడ్ అస‌లు సాధ్య‌మేనా అనిపించినా.. ఈ ఇద్ద‌రూ ఏడో వికెట్‌కు 113 పరుగులు జోడించి కీల‌క‌మైన ఆధిక్యాన్ని క‌ట్ట‌బెట్టారు. ఈ క్ర‌మంలో పంత్ టెస్టుల్లో మూడో సెంచ‌రీ చేయ‌డా… సుంద‌ర్ మూడో హాఫ్ సెంచ‌రీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *