వేతన జీవుల‌కు శుభ‌వార్త‌- కేంద్ర కార్మిక సంఘం

న్యూఢిల్లీ: దేశంలో ఎక్క‌డ చూసిన క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల‌న అనేక కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. ఆర్థికంగా కృగిపోయాయి. ఇలాంటి త‌ర‌ణంలో క‌రోనా ఎక్క‌వగా ఉండ‌టం వ‌లన క‌రోనా లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న వేత‌న జీవుల‌కు కేంద్రం ప్ర‌భుత్వం ఊర‌ట‌నిచ్చే వార్త చెప్పింది. వారి ఆర్థిక ఇబ్బందును తొల‌గించేందుకు ఉద్యోగుల భ‌విష్య‌నిధి (ఈపీఎఫ్‌వో) ఖాతా నుండి కొంత మొత్తాన్ని అడ్వాన్స్‌గా తీసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్టు కేంద్ర కార్మిక శాఖ తెలిపింది. గ‌త సంవ‌త్స‌రం కూడా కేంద్రం ఇలాంటి వెసులుబాటే క‌ల్పించింది. క‌రోనా రెండో ద‌శ‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న ఈపీఎఫ్‌వో ఖాతాదారుల‌కు అండ‌గా నిలిచే ఉద్దేశంతో రెండోసారి నాన్ రిఫండ‌బుల్ కొవిడ్ అడ్వాన్స్‌ను తీసుకునే వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్టు ప్ర‌భుత్వం పేర్కొంది. గ‌త సంవ‌త్స‌రం కూడా ఇదే స‌దుపాయాన్ని తీసుకొచ్చింది. గ‌తంలో ఈ స‌దుపాయాన్ని వినియోగించుకున్న‌వారు కూడా రెండోసారి ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. ఈపీఎప్ స‌భ్యుల‌కు క‌రోనా అడ్వాన్స్ గొప్ప స‌హాయ‌కారి అవుతుంది. ముఖ్యంగా రూ.15 వేల లోపు వేతనం ఉన్న‌వారికి . ఈరోజు వ‌ర‌కు ప్ర‌భుత్వం 76.31ల‌క్ష‌ల‌కు పైగా కొవిడ్-19 అడ్వాన్స్ క్లైముల‌ను ప‌రిష్క‌రించింది. ఇందుకోసం రూ.18,698.15 కోట్లు చెల్లించింది. కార్మిక శాఖ తెలిపింది. అంతేకాదు, అడ్వాన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి మూడు రోజుల్లో పే ప‌రిష్క‌రిస్తున్న‌ట్టు పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *