మ‌రోసారి క‌రెంట్ చార్జీల షాక్‌..

హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మ‌రో షాక్ ,మ‌రోసారి క‌రెంట్ చార్జీల పెంపు.డిస్క‌మ్‌లు వ‌య్యం లోటును భ‌ర్తీ చేసుకునేందుకు నూత‌న దారులు వెతుకున్నాయి. రాష్ట్రంలో త్వ‌ర‌లో విద్య‌త్ చార్జీల షాక్ త‌గులుతుంది. ఇటువంటి క‌రెంట్ వ్య‌య స‌ర్దుబాటును కొన్ని రాష్ట్రాల్లో ఎప్ప‌టిక‌ప్పుడు వినియోగ‌దారుల నుంచే వ‌సూలు చేస్తున్నారు. అదికూడా ప్ర‌తిసారి ఈఆర్‌సీ నుండి అనుమ‌తి తీసుకోకుండానే వ‌సూలు చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఎక్కువ ధ‌ర‌పెట్టి విద్యుత్ను కొనుగోలు చేయాల్సి వ‌స్తోంద‌ని అప్పుడు వినియోగ‌దారుల నుండి వ‌సూలు చేసే ధ‌ర‌కు, కొనుగోలు ధ‌ర‌కు వ్య‌త్యాసం ఉంటుంద‌ని అంటున్నాయి. వినియోగం ఆధారంగా సెక్యూరిటీ డిపాజిట్ల‌నుభారీగా పెంచుకోవ‌డానికి కూడా ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించాయి. త‌ద్వారా కొండ‌లా పెరుగుతున్న త‌మ ఆర్థిక లోటును పూడ్చుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *