కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మీష‌న‌ర్‌గా సుశీల్ చంద్ర..

ఇప్పుడు ఈసీఐ సునీల్ అరోరా ప‌ద‌వీకాలం మంగ‌ళ‌వారానికి పూర్తికానుంది.మంగ‌ళ‌వారం ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. నూత‌న భార‌త ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారిగా సీనియ‌ర్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సుశీల్ చంద్ర‌ను నియ‌మితులుకానున్నారు. మే14 ,2022 వ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు సుశీల్ చంద్ర‌.. ఇప్పుడు కేంద్ర ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్‌గా ఉన్న ఆయ‌న మంగ‌ళ‌వారం బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. కేంద్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన క‌మీష‌న‌ర్‌గా సుశీల్ చంద్ర ఆధ్వ‌ర్యంలో గోవా, మ‌ణిపూర్‌, ఉత్త‌రాఖండ్‌,పంజాబ్ ,ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం క‌స‌ర‌త్తుచేస్తోంది. వ‌చ్చే ఏడాది మే 14 తో ఉత్త‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ప‌ద‌వీకాలం ముగియ‌నుంది. ఇక‌,కేంద్ర ఎన్నిక‌ల సంఘంలో బాధ్య‌త‌ల‌కు ముందు కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు ఛైర్మ‌న్‌గా ప‌నిచేశారు సుశీల్ చంద్ర‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *