72గంట‌ల్లో ఆ హోర్డింగ్‌ల‌ను తీసివేయాలి- భార‌తీయ ఎన్నిక‌ల సంఘం

కోల్‌క‌తా: మోదీస‌ర్కారుకు భార‌తీయ ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ప్ర‌ధాని మోదీ పెట్రోల్ పెంపుల్లో ఉన్న హోర్డింగ్‌ల‌ను వెంట‌నే తీసియాలి. బెంగాళ్‌కు చెందిన తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు బుధ‌వారం ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిశారు. పెట్రోల్ పంపుల వ‌ద్ద ఉన్న ప్ర‌ధాని హోర్డింగుల్లో.. కేంద్ర‌ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను ప్ర‌మోట్ చేస్తున్నార‌ని, ఇది ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి వ్య‌తిరేక‌మ‌ని, అందుకే ఆ హోర్డింగ్‌ల‌ను తీసివేయాల‌ని త‌మ ఫిర్యాదులో తృణ‌మూల్ పేర్కొన్న‌ది. ఆ ఫిర్యాదుకు స్పందించిన ఈసీ… 72 గంట‌ల్లోగా ఆ హోర్డింగ్‌ల‌ను తీసివేయాల‌ని ఆదేశించింది. భారీ హోర్డింగ్‌ల్లో మోదీ ఫొటోల‌ను వాడ‌డం ఎన్నిక‌ల నియ‌మావ‌ళికి వ్య‌తిరేక‌మ‌ని ప‌శ్చ‌మ బెంగాల్ సీఈసీ అధికారి కూడా తెలిపారు. ఫిబ్ర‌వ‌రి 26న తేదీన కేంద్ర ఎన్నిక‌ల సంఘం బెంగాళ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తేదీల‌ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఆరోజు నుంచి ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింది. బెంగాళ్‌లో మొత్తం 8ద‌శ‌ల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *