ధోనీ చెప్పిందే చేశాడ‌ని సంజ‌య్ వివ‌రించారు. …

హైద‌రాబాద్ః 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ముందు భార‌త జ‌ట్టును ఎంపిక చేసిన‌ప్పుడు ధోనీ చెప్పిన మాట‌ల‌ను నిల‌బెట్టుకున్నాడ‌ని మాజీ సెలెక్ట‌ర్ సంజ‌య్ జ‌గ్దాలే పేర్కొన్నారు. తాజాగా ఆయ‌న ఓ క్రీడాఛాన‌ల్ తో మాట్లాడుతూ నాటి విష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు. అప్ప‌ట్లో తాను సెలెక్ట‌ర్‌గా ఉండ‌గా, మొద‌టి టీ20 ప్ర‌పంచ‌క‌ప్ టోర్నీకి దిగ్గ‌జ ఆటగాళ్లైన స‌చిన్‌, గంగూలీ, ద్ర‌విడ్‌, త‌మ‌ని ఎంపిక చేయొద్ద‌ని స్వ‌యంగా చెప్పార‌న్నారు. దాంతో యువ ఆట‌గాళ్ల‌తో కూడిన టీమ్ ఇండియాను ఎంపిక చేసి ధోనీని తొలిసారి కెప్టెన్‌గా చేశామ‌ని తెలిపారు. అప్పుడు తాను ధోనీతో మాట్ల‌డుతూ ఇదో మంచి జ‌ట్ట‌ని పేర్కొన్న‌ట్లు గుర్తుచేస్తున్నారు. దానికి మ‌హీ స్పందిస్తూ … క‌చ్చితంగా ప్ర‌పంచ‌క‌ప్‌తోనే తిరిగి వ‌స్తామ‌ని చెప్పాడ‌ని సంజ‌య్ వివ‌రించారు. అత‌డి ఆత్మ‌విశ్వాసాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయాన‌ని తెలిపారు. ఇదిలా ఉండ‌గా, 2007లో టీమ్ ఇండియా రాహుల్ ద్ర‌విడ్ నేతృత్వంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఘోరా ప‌రాభ‌వం పాలైన విష‌యం తెలిసిందే. అనంత‌రం జ‌రిగిన తొలి టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ధోనీ సార‌థ్యంలో పాకిస్థాన్‌పై ఉత్కంఠ పోరులో ఫైన‌ల్ మ్యాచ్ గెలిచింది. దీంతో ధోనీ చెప్పిందే చేశాడ‌ని సంజ‌య్ వివ‌రించారు. ఇక మ‌హీ టీమ్ ఇండియా కెప్టెన్‌గా జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌టిపించాడు. వ‌రుస‌గా మ్యాచ్‌లు గెలుస్తూ భార‌త్‌ను అగ్ర‌స్థానంలో తీసుకెళ్లాడు. ఈక్ర‌మంలోనే 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌,2013 ఛాంపియ‌న్స్ ట్రోఫీ సాధించాడు. ఆపై 2014టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఫైన‌ల్స్‌కు,2015వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోభార‌త్ సెమీస్‌కు, 2016టీ 20ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌రోసారి సెమీస్‌కు తీసుకెళ్లాడు. ఇక 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ సెమీఫైన‌ల్స్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓట‌మిపాల‌వ్వ‌డంతో ధోనీ అంత‌ర్జాతీయ ఆట‌కు దూర‌మ‌య్యాడు. ఏడాది పాటు విశ్రాంతి తీసుకొని ఆగస్టు 15న రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *