ఓటు వేసిన చోటే క‌రోనా టీకా వేయించుకోవాలి – సీఎం

హైద‌రాబాద్‌: దేశ రాజ‌ధానిలో త‌గ్గుముఖం ప‌ట్టిన క‌రోనా కేసులు, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌భుత్వం క‌రోనా మాస్ వ్యాక్సినేష‌న్ ప్రోగ్రాంను లాంచ్ చేశారు. ప్రెస్ కాన్పిరెన్స్ లో ముచ్చ‌టిస్తూ…ఎన్నిక‌ల్లో ఓట్లు వేసిన చోటే కరోనా టీకా వేసుకోవ‌చ్చ‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు.జూన్ 7 నుండి ఓటు ఎక్క‌డైతే టీకా అక్క‌డే ప్ర‌చారం మొద‌లుపెట్టామ‌ని ఈ ప్ర‌చారంలో భాగంగా ప్ర‌జ‌లు పోలింగ్ స్టేష‌న్ల‌కువెళ్లి వ్యాక్సినేష‌న్ చేయించుకుంటార‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.త్వ‌ర‌లోనే డోర్ టూ డోర్ క‌రోనా టీకా కూడా ఉంటుంద‌ని ప్రెస్ కాన్పిరెన్స్ వేదిక‌గా ప్ర‌క‌టించారు. వ‌చ్చే 4వారాల్లో 45 సంవ‌త్సరాల కంటే ఎక్కువ వ‌య‌స్సున్న వాళ్లంద‌రికీ వ్యాక్సిన్ అందేలా ప్లాన్ చేస్తున్నామ‌ని ఢిల్లీ సీఎం అన్నారు. ఢిల్లీలో క‌రోనా కేసుల న‌మోదు త‌గ్గ‌డంతో అన్‌లాక్ ప్ర‌క్రియ షూరూ అయింది. రోజుకు 40వేల‌కుపైగా న‌మోదైన స్థాయి నుండి 400 కంటే త‌క్కువ కేసుల‌తో కొన‌సాగుతూ ఉంది దేశ రాజ‌ధాని .ఈ మేరకు నిబంధ‌న‌లు స‌డ‌లించే ప‌ని‌లో ప‌డింది. దుకాణాలు ,మాల్స్‌, మార్కెట్ కాంప్లెక్సులు ఓపెన్ చేయాల‌ని నిర్ణయించారు. ప్ర‌త్నామ్నాయ ప‌ద్ద‌తిలో ఓపెన్ చేయాల‌ని స‌రి, బేసి విధానాల‌ను అమ‌ల్లోకి తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *