8నుంచి 16వ‌ర‌కు ఢిల్లీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు.

న్యూఢిల్లీ:ఈనెల 8నుంచి 16వ తేదీ వ‌ర‌కూ బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఉప ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా ఒక ట్విట్ లో తెలిపారు. 8వ తేదీ నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు ఉంటాయిన‌,కోవిడ్‌-19 నిబంధ‌న‌లు అమ‌ల్లు ఉంటాయ‌ని ఆయ‌న తెలిపారు.2021-22 బ‌డ్జెట్ను ఈస‌మావేశంల్లో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెడుతుంది. ఆరోగ్యం, విద్య‌, మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న ,నీటి స‌ర‌ఫ‌రా వంటి రంగాల‌పై బ‌డ్జెట్లో ప్ర‌ధానంగా దృష్టి సారించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కొత్త ప‌న్నులు ఉండే అవ‌కాశాలు కూడా లేవంటున్నారు. 2020-21 లోరూ. 65,000 కోట్ల బ‌డ్జెట్ ను ప్ర‌భుత్వం స‌మ‌ర్పించింది. అంత‌కు ముందు ఏడాది కంటే 10శాతం బ‌డ్జెట్ కేటాయింపులు పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *