ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ఉచిత వ్యాక్సిన్ ఇస్తాం-కేజ్రీవాల్

న్యూఢిల్లీ: ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి విజృభిస్తున్న త‌రుణంలో రోజురోజుకు పెట్రేగిపోతున్న కొవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు పడుతున్నారు. డిల్లీముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ మే1 నుండి 18-44 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌వారికి వ్యాక్సినేష‌న్ డ్రైవ్ ప్రారంభం కానున్న సంద‌ర్భంలో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తాజా విజ్ఞ‌ప్తి చేశారు. వ్యాక్సిన్ ఇంకా త‌మ‌కు అంద‌లేద‌ని, అందువ‌ల్ల వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల వ‌ద్ద ప్ర‌జ‌లు క్యూలు క‌ట్ట‌వ‌ద్ద‌ని కోరారు. నేడు ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ .వ్యాక్సిన్ కంపెనీతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నామ‌ని, శ‌నివారం కానీ, ఆదివారం కానీ వ్యాక్సిన్ వ‌స్తుంద‌నే ఆశాభావంతో ఉన్నామ‌ని చెప్పారు. కంపెనీ నుండి త‌మ‌కు ఈమేర‌కు వ‌చ్చింద‌న్నారు. తొలి విడత‌గా కోవిషీల్డ్ 3లక్ష‌ల డోసులు వ‌స్తాయ‌ని చెప్పారు. వ్యాక్సిన్ రాగానే అవ‌స‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేస్తామ‌ని, అప్పుడే ఆపాయింట్ మెంట్స్ తీసుకున్న వారు వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌కు వెళ్ల‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. వ్యాక్సిన్ త‌యారీ కంపెనీల రెండింటిని చెరో 67 ల‌క్ష‌ల డోసుల చొప్పున రాబోయే మూడు నెల‌ల్లో అంద‌జేయాల్సిందిగా కోరిన‌ట్టు కూడా సీఎం తెలిపారు. ఢిల్లీ ప్ర‌భుత్వం ఇందుకు డ‌బ్బులు చెల్లిస్తుంది. ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు ఉచిత వ్యాక్సిన్ ఇస్తాం. రాబోయే మూడు నెల‌ల్లో ప్ర‌జ‌లంద‌రికీ వ్యాక్సిన్ అందేలా అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్ఆనం. అని కేజ్రీవాల్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *