స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది…..

హైద‌రాబాద్‌లో మ‌రికాసేప‌ట్లో కోల్‌క‌త్తా నైట్ రైడ‌ర్స్‌తో స‌న్‌రైజ‌ర్స్ త‌ల‌ప‌డ‌నుంది.ఈ నేప‌థ్యంలో టాస్ గెలిచిన హైద‌రాబాద్ కెప్టెన్ డేవిడ్ వ‌ర్నార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే, రెండుటీమ్‌ల‌కు ఈ సీజ‌న్‌లో ఇదే తొలి మ్యాచ్ కావ‌డంతో విజ‌యంతో టోర్నీని ఆరంభించాల‌ని చూస్తున్నాయి. హైద‌ర‌బాద్ 2016 లో చివ‌రిసారి ట్రోఫీని ముద్ధాడ‌గా, కోల్‌క‌త్తా 2014 లో చివ‌రిసారి విజేత‌గా నిలిచింది. దీంతో అప్ప‌టి నుంచి రెండు టీమ్‌లు మ‌రో టైటిల్ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాయి. ఇక ఈరోజు ఎవ‌రు శుభారంభం చేస్తారో చూడాలి.స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు, డేవిడ్ వార్న‌ర్ (కెప్టెన్‌). జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్‌సాహా, మ‌నీశ్ పాండే, విజ‌య్ శంక‌ర్ ,అబ్దుల్ స‌మ‌ద్‌, మ‌హ్మ‌ద్ న‌బీ, ర‌షీద్ ఖాన్‌, భువ‌నేశ్వ‌ర్ కుమార్, న‌ట‌రాజ్, సందీప్ శ‌ర్మ‌, కోల్ క‌త్తా జ‌ట్టు శుభామ‌న్‌గిల్ ,రాహుల్ త్రిపాఠి, నితీశ్‌రాణా, ఇయాన్‌మోర్గాన్ (కెప్టెన్‌), దినేష్ కార్తీక్‌, ఆండ్రూ ర‌సెల్, ష‌కిబ్ అల్‌హ‌స‌న్‌, పాట్ క‌మిన్స్‌, హ‌ర్భ‌జ‌న్‌సింగ్, ప్ర‌సిద్ధ్‌కృష్ణ‌, వ‌రుణ్‌చ‌క్ర‌వ‌ర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *