లాక్‌డౌన్ రూల్స్ అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు…..

హైద‌రాబాద్: లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసుల‌కు సీపీ ఆదేశాలు జారీ చేశారు.తెలంగాణ స‌ర్కారువిధించిన లాక్ డౌన్ రూల్స్ అతిక్ర‌మిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ న‌జ్జ‌నార్ స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం ఉద‌యం హైటెక్ సిటీ, జేఎన్టీయూ, కూక‌ట్‌ప‌ల్లి వై జంక్ష‌న్‌, జీడిమెట్ల‌, బాలాన‌గ‌ర్ ఎక్స్ రోడ్ల‌లో సీపీ స‌జ్జ‌నార్ ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు.లాక్ డౌన్ క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌ను ప‌రిశీలించారు. భ‌ద్ర‌త కోసం లాక్ డౌన్‌ను ప్ర‌భుత్వం విధించింద‌ని, దీన్ని ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని సీపీ స‌జ్జ‌నార్ సూచించారు. పోలీసుల‌కు ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌రేట్ ప‌రిధిలో 100 కు పైగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామ‌న్నారు. ఫేస్ మాస్కు ధ‌రించ‌ని వారికి త‌ప్ప‌నిస‌రిగా రూ.1000 జ‌రిమానా విధించాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *