తెలంగాణ కు క‌రోనా టీకా రానేవ‌చ్చింది….

హైద‌రాబాద్ః ఎప్పుడోస్తుందా అని ఎదురుచూస్తున త‌రుణంలో క‌రోనా టీకా రాష్ట్రానికి రానే వ‌చ్చింది. మంగ‌ళ‌వారం ఉద‌యం పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి ట్రక్కుల్లో పుణె ఎయిర్‌పోర్టుకు త‌ర‌లించారు. అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక కార్గో విమానంలో కొవిడ్ వ్యాక్సిన్‌ను శంషాబాద్ విమాన‌శ్ర‌యానికి త‌ర‌లించారు. 6.5ల‌క్ష‌ల డోసుల కొవిడ్ టీకాలు ఉద‌యం 11గంట‌ల స‌మ‌యంలో రాష్ట్రానికి చేరుకున్నాయి. మ‌రికాసేప‌ట్లో శంషాబాద్ నుంచి కోఠిలోని శీత‌లీక‌ర‌ణ కేంద్రానికి టీకా డోసుల‌ను త‌ర‌లించ‌నున్నారు. కోఠి ఆరోగ్య కార్యాల‌యంలో 40 క్యూబిక్ మీట‌ర్ల వ్యాక్సిన్ కూల‌ర్ ఏర్పాట్లు చేశారు. ఈనెల‌16నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేష‌న్ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేష‌న్ కు ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్‌ను త‌ర‌లించేందుకు 866 కోల్డ్ చైన్ పాయింట్లు ఏర్పాటు చేశారు. తొలి రోజు 139కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్ టీకా వేయ‌నున్నారు. మొత్తం తొలుత 2.90ల‌క్ష‌ల మంది ప్ర‌భుత్వ ప్ర‌యివేటు వైద్య సిబ్బందికి టీకా వేయ‌నున్నారు. వారంలో నాలుగు రోజులు వైద్య‌సిబ్బంది టీకాలు వేయ‌నుంది. బుధ‌,శ‌నివారాల్లో య‌థావిధిగా సార్వ‌త్రిక టీకాల కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది. ప్ర‌తి రోజు ఉద‌యం 9 నుంచి 4గంట‌ల వ‌ర‌కు టీకా పంపిణీ కార్య‌క్ర‌మం కొన‌సాగ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *